అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా

Published : Jul 16, 2017, 09:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా

సారాంశం

వైసిపి ఎంపి మేకపాటి మీద టిడిపి ఎమ్మెల్యే నిప్పులు లిక్కర్ బాటిల్స్  ఇవ్వలేదని దుకాణాలు మూయించిన మేకపాటి పేదల భూములు కాజేసిన మేకపాటి మహారాష్ట్ర కాంట్రాక్టుల అవినీతి నిరూపిస్తే రాజీనామా

 

 

 నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తమ్ముడు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉదయగిరి టిడిపి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు  తీవ్రంగా మండిపడ్డారు. మహరాష్ట్రలో  తనమీద ఎసిబి విచారణ జరగుతున్నదని, ఎపుడయినా అరెస్టు చేయవచ్చనే వదంతులు సృష్టించిందని వారేనని ఆయన ఆరోపించారు. ప్రతి రాజమేహన్ రెడ్డి మీదే తీవ్రమయిన ఆరోపణలు చేశారు. క్వార్టర్ లిక్కర్ బాటిళ్లకు కక్కుర్తి పడి మధ్యం దుకాణాలు మూయించిన కీర్తి  రాజమేహన్ రెడ్డిదే నని అన్నారు. ‘ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి నేను చేస్తున్న కృషికి వైసిపి నేతలే అభినందనలు చెబుతున్నారు. ఇది ఓర్వలేకనే ఫైబర్ చెక్ డ్యాం నిర్మాణాలలో 40 కోట్ల అవినీతికి పాల్పడినానని ప్రచారం చేస్తున్నారు. అయిదు రాష్ట్రాలలో  వందల కోట్ల విలువయిన కాంట్రాక్టు పనులు చేస్తున్నాను. పైసలకు కక్కుర్తి పడే వాడినికాదు,’ అని ఆయన అన్నారు.

పేదల భూములను అక్రమించిన చరిత్ర కూడా వైసిపి ఎంపిదేని బొల్లినేని అన్నారు. అవినీతి పై బహిరంగ చర్చకు సిద్ధమని, నిరూపిస్తే రాజీనామా చేస్తానని టిడిపి ఎమ్మెల్యే సవాల్. విసిరారు.

ఇప్పటి బిజెపి ప్రభుత్వం పాత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనుల మీద విచారణ  చేయించింది. అంతేతప్ప ఒక కేసుకు సంబంధించినది కాదు. పదేళ్ల కిందటి మాట. ఇళ్లలో సోదాలు చేసిన వార్తలు అబద్దం.  విచారణలో ఏదయినా తెలి, కోర్టు ఏదయిన నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాను. 2007-2008 నాడు కంపెనీకి ఛెయిర్మన్ గా నేనున్నాను..అపుడు అవకతవకలు జరిగినట్లు కోర్టు చెబితే, అపుడు ఆలోచిస్తాను అని బొల్లినేని అన్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !