టిటిడి ఛెయిర్మన్ బీదా మస్తాన్ రావు?

Published : Jul 22, 2017, 03:44 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
టిటిడి ఛెయిర్మన్ బీదా మస్తాన్ రావు?

సారాంశం

చాలా కాలంగా ఖాళీ గా ఉన్నటిటిడి ఛెయిర్మన్ పదవి పారిశ్రామిక వేత్తలకు కాకుండా  పార్టీ విధేయుడికి పట్టం పరిశీలనలో బీద మస్తాన్ రావ్ యాదవ్  పేరు

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి ఛెయిర్మన్ పదవికి ఇపుడు కొత్తపేరు ప్రచారంలోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన బిసి నాయకుడు బీదా మస్తాన్ రావును నియమించే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలనలో ఉందని సమాచారం. చదలవాడ కృష్ణమూర్తి ఛెయిర్మన్ రిటైర్ అయినతర్వాత ఆ పోస్టుకు ఎవరిని నియమించలేదు. కమ్మకులానికి చెందిన హేమా హేమీల పేర్లు వినబడ్డాయి. టిడిపి లోక్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు   ఈ పదవి కోసంతీవ్రంగా కృషి చేశారు. ఆ తర్వాత  రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మురళీ మోహన్ కూడా ఈ పదవిని ఆశించారు. ఈ మధ్యలో ఎన్టీఆర్ కుమారుడు, మాజీ రాజ్యసభ్యుడు నందమూరి హరికృష్ణ పేరు కూడా వినిపించింది. ఎపుడూబాగా పేరున్న బిజినెస్ పీపుల్ కే  ఈ పోస్టు పోతా ఉంటుంది. అలాంటిది ఇపుడు బీదా మస్తాన్ రావు పేరు వినపడటం వింతగా ఉంది.  అందునా బిసివర్గానికి చెందిన వ్యక్తి పేరు పరిశీలనలో ఉందన్న వార్త చాలా మందికి ఆశ్చర్యాన్ని కల్గిస్తూ ఉంది. మస్తాన్ రావు యాదవ కులానికి చెందిన వ్యక్తి. మస్తాన్ రావు తెలుగుదేశం ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర సోదరుడు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !