
అనిల్ కపూర్ బాలీవుడ్ సీనియర్ యాక్టర్. ఇప్పటికి తనదైనా నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అర్జున్ కపూర్ హీరోగా నటించిన మూబారకన్ సినిమాలో అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రచారం లో భాగంగా అర్జున్ కపూర్ తన మామ అయిన అనిల్ కపూర్ ని ఇంటర్వూ చేశారు.
ఆ ఇంటర్వూలో అర్జున్ కపూర్, అనిల్ కపూర్ ని పలు ప్రశ్నలు అడిగారు. అందులో అర్జున్ ఇలా అడిగాడు ఇది వరకు ఎవరితో అయినా డేటింగ్ చేశారా... ! అని దానికి ఏ మాత్రం తడుముకోకుండా సిని పరిశ్రమకు సంబంధించిన 20 నుండి 25 మందితో డేటింగ్ చేసినట్లు ఆయన తెలిపారు. అందులో సునిత అనే ఆమె చాలా మంచిదని. అందుకే ఆమెతో ఎక్కువ కాలం డేట్ చేసి చివరికి పెళ్లీ చేసుకున్నాను ఆయన తెలిపారు.
మూబారకన్ సినిమా ఈ నెల 28 వ తేదీన విడుదల అవ్వనుంది. అర్జున్ కపూర్ డబుల్ రోల్ లో పంజాబి యువకుడిగా నటించనున్నారు. అనిల్ కపూర్ తో పాటు ఇలియానా, నేహా శర్మా, అతియా శర్మా లు నటించారు.