(వీడియో ) ఈ పోలీసాయన ప్రతాపం చూడండి...

First Published Apr 12, 2017, 7:08 AM IST
Highlights

తాను డ్యూటిలో ఉండగా ఈ అమ్మలక్కలు రోడ్డెక్కడమేమిటి,ప్రభుత్వం సారాదుకాణానికి వ్యతిరేకత చూపడమేమిటని  ఈ డిఎస్పి చిందులేశాడు. కోపంగా వారి దగ్గిరకు  పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ప్రదర్శకురాలి చెంపమీద గట్టిగా కొట్టి మరొక ఇద్దరు తోసేసి వెళ్లాడు.

తమిళనాడులో ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలకు నిరసన తెలుపుతున్న ఒక మహిళ మీద సీనియర్ పోలీసధికారి ఒకరు చేయి చేసుకుని ప్రతాపం చూపించారు. 

ఈ సంఘటన నిన్న సాయంకాలం తిరుపూర్ జిల్లాలోజరిగింది. ఈ సంఘటన విషయం టివి కెమెరాలకంట పడింది. పట్టణంలోని శామలాపురం వద్ద కొంత మంది మహిళలు తమిళనాడు ప్రభుత్వం (టిఎ ఎస్ ఎమ్ఎ సి) మద్యం దుకాణాలకువ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఆప్రాంతంలో ప్రభుత్వం ఒక మద్యం దుకాణానికి లైసెన్స్ ఇచ్చంది. దీనికి వారు వ్యతిరేకత  తెలపుడానికి రోడ్డ ట్రాఫిక్కు అంతరాయం కల్గించారు.

 

 అక్కడ విధుల్లో పాండియ రాజన్ అనే డిఎస్ పి విధుల్లో ఉన్నాడు. తాను డ్యూటిలో ఉండగా ఈ అమ్మలక్కలు రోడ్డెక్కడమేమిటి,ప్రభుత్వం సారాదుకాణానికి వ్యతిరేకత చూపడమేమిటని చిందులేశాడు. కోపంగా వారి దగ్గిరకు  పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ప్రదర్శకురాలి చెంపమీ ద గట్టిగా కొట్టి మరొక ఇద్దరు తోసేసి వెళ్లాడు.

 

ఇది ప్రజలను మరింత కోపోద్రిక్తులను చేసింది. వాళ్లుపోలీసుల మీదకు రాళ్లు రువ్వారు. పోలీసు రెచ్చిపోయి లాఠీ చార్జ్ చేశారు. ఈ గొడవలో పలువురు గాయపడ్డారు. మహిళ మీద పోలీసు అధికారి చేయిచేసుకున్నవిషయాన్ని ఈ రోజు ట్రాఫిక్ రామస్వామి  హైకోర్టు లో ఫిర్యాదు చేశారు.

 

click me!