రేఖ, సచిన్ : కొత్త పార్లమెంటు రికార్డ్స్

First Published Apr 12, 2017, 6:13 AM IST
Highlights

 రాజ్యసభ ను కళ తెస్తారనుకున్న ఇద్దరు భారతీయులు అడపా దడపా పార్లమెంటుకు రావడంతో రికార్డు సృష్టించారు. వారిలో ఒకరు సినీ నటి రేఖ కాగా రెండో వ్యక్తి సచిన్ తెందూల్కర్. అయిదేళ్ల కాలంలో  రేఖ 18 రోజులుసభకు వస్తే, సచిన్  కొద్దిగా మెరుగ్గా 23 రోజులు హాజరయ్యారు.

ఆయన భారత రత్న. దానితో పాటు పార్లమెంటు సభ్యుడు కూడా. అయితే, పార్లమెంటుకెపుడూ హాజరుకారు. ఈ విషయంలో ఆయన  రికార్డు సృష్టించారు. ఈ పాటికి ఆయనెవరో తెలిసిపోయింది కదూ, ఆయన సచిన్ టెండూల్కర్. పార్లమెంటు భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక.  ఆయన క్రీడా రంగంలో భారత్ పేరుప్రతిష్టలను పెంచడానికి గుర్తింపుగా ఇచ్చిన గౌరవం పార్లమెంటు సభ్యత్వం. దీనిని కూడా గౌరవించాలి. అయితే, అపుడపు వచ్చిన పార్లమెంటులో జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలమీద తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. అయితే, అలాంటిదేమీ జరగడం లేదు. ఇది పార్లమెంటును అగౌరవపరచడమే కదా అనే విమర్శ మొదలయింది. సచిన్ విశేషమేమంటే, మొట్టమొదట రాజ్యసభకు నామినేట్ అయినా మొట్టమొదటి క్రీడాకారుడు, అందునా క్రికెటర్ సచినే. జూన్ 4,2012 న ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటి సభలో ప్రవేశించిన మరొక తార రేఖ. వీరిరువురితో సభ కళకళ లాడుతుందన్న కున్నారు. అలాంటిదేమీ జరగలేదు. 

 

రాజ్యసభలోన 12 మంది నామినేటేడ్ సభ్యులుంటారు. వీరు వివిధ రంగాలలో విశేష కృషి సలిపిన వారు. వీరిలో పార్లమెంటును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది ఇద్దరు సభ్యులే. వారిలో ఒకరు సచిన్ కాగా,రెండో వారు ప్రముఖ నటి రేఖ. అతితక్కువ సార్లు పార్లమెంటుకు వచ్చిన వారిలో నెంబర్ వన్ రేఖ. 2012లో రాజ్యసభ సభ్యత్వం పొందినప్పటినుంచి  పార్లమెంటు 348 రోజులు పనిచేస్తే రేఖ హాజరయింది కేవలం 18 రోజులు మాత్రమే. సచిన్ కొద్దిగా మెరుగ్గా 23 రోజులు హాజరయ్యారు.   రేఖ ఏ సమావేశంలోనూ ఒక్క రోజుకు మించి హాజరుకాలేదు.

 

సచిన్ , రేఖలు రాజ్యసభ సభ్యులై అయిదేళ్లవుతూఉంది.  ఆమె సభలో నోరెత్తి ఒక్క ప్రశ్నకూడా వేయలేదు. సచిన్ కొంచెం మెరుగు 22 ప్రశ్నలడిగారు. 

 

రేఖ మీద ఇంతవరకు రు.65 లక్షలు జీతభత్యాల కింద పార్లమెంటుకు ఖర్చయ్యాయి. తెందూల్కర్ మీద పెట్టిన ఖర్చు 58.8లక్షలు. హజరయిన  ప్రతి రోజూ రేఖ మీద పెట్టిన ఖర్చు రు. 3.6 లక్షలు,  తెందూల్కర్ మీద అయిన వ్యయం రు. 2.56 లక్షలు. ఇది ఫ్యాక్ట్ లీ అనే సంస్థ విశ్లేషణ జరిపి ఈ వివరాలు వెల్లడించింది.

 

click me!