
బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీ లియోన్ హాట్ హాట్ గా అందాలు ఆరబోయడమే కాదు.. అంతే హాట్ గా కూడా మాట్లాడుతోంది.
రాయిస్ మూవీలో సన్నీ లియోన్ చేసిన లైలా మై లాలా అనే ఐటమ్ సాంగ్ ఇప్పుడు యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది.
ఇటీవలే ఈ పాటను ఆన్ లైన్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దాదాపు 2 కోట్ల మంది దీన్ని విక్షించారు.
అయితే ఇందులో సన్నీ డ్యాన్స్ చూసిన ముంబైకి చెందిన ఓ సంస్థ న్యూ ఇయర్ ఈవెంట్ లో ఆమె డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించిందని టాక్ వినిపించింది.
దీని కోసం సన్నీకి రూ. 4 కోట్లు కూడా ఆఫర్ చేశారట అని తెలిసింది.
అయితే దీనిపై స్పందించిన సన్నీ ఆ వార్తలు నిజం కాదని ప్రకటించింది.
కాకపోతే ఆ వార్తలు నిజమైతే చాలా బాగుంటుందని తన మనసులో మాట బయటపెట్టింది.
ఐదు నిమిషాల డ్యాన్స్ కు 4 కోట్లు ఇస్తే అంతకంటే ఏం కావాలని ప్రశ్నిస్తోంది.