'ప్రజల కోసం' పార్టీ ఫిరాయించిన కల్పన

Published : Dec 23, 2016, 10:02 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
'ప్రజల కోసం' పార్టీ ఫిరాయించిన కల్పన

సారాంశం

టిడిపి అచ్చిరాక , 2014 లో  వైసిపిలో చేరి, ఎన్నికల్లో  గెల్చి  ,ఇపుడు పాత  ఇల్లే బాగుందని టిడిపిలో చేరారు  ఉప్పులేటి కల్పన

పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న కేసులు భవిష్యత్ ఫిరాయింపుదార్లను భయపట్టేలా లేవు. గెలిపించిన పార్టీని వదిలేసేందుకు వాళ్లూ సిగ్గుపడటం లేదు. చేర్చుకునే వాళ్లూ అంతే. 

 

అందుకే నిర్భయంగా పామర్రు నియోజకవర్గ శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఈ రోజు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో  వైఎస్ ఆర్ సి గుడ్ బై చెప్పి పచ్చ కండువా అందుకున్నారు. 

 

ముఖ్యంగా కండువాను కూడా  2014 ఎన్నికల ఆమె చేతిలో ఓడిపోయిన  పర్లరామయ్య సిఎంకు అందించారు. సిఎం ఆమెకు కప్పారు.  ఎప్పటిలాగా ఆమె ‘ ఇది చాలా శుభ సమయం. సొంత ఇంటికొచ్చినంత ఆనందంగా ఉంది,’ అని చిరునవ్వులు చిందిస్తూ  ప్రకటించారు.

 

అమె టిడిపిలో చేరతారని, టిడిపి నాయకులు  విజయవంతంగా ఆమెను  పిరాయింపునకు ఒప్పించారని ప్రచారమవుతూ వచ్చింది.

 

ఏడాది కాలం నుంచి వైసిపి వీడతారన్న ప్రచారం జరిగింది. బుధవారం సాయంత్రం పలువురు వైసిపి, టిడిపి నాయకులతో ఆమె మాట్లాడి, అంతా 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విజయ వాడ చేరుకోవాలని ఆమె కోరారు. అందుకు కొందరు నిజానికి ఆమె టిడిపి తర ఫున రాజకీయాల్లో ప్రవేశించారు. గతంలో నిడు మోలు, పామర్రు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుసార్లు కాంగ్రెస్ అభ్య ర్థులపై ఓటమి చవిచూశారు. 2014లో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.  

 

ఎన్ని కల్లో టిడిపి నేత వర్ల రామయ్యపై విజయం సాధించి అసెబ్లీలో కాలుపెట్టారు.  అయితే, ఇపుడామె ఎలాంటి జంకు గొంకు లేకుండా, తాను సొంతఇంటికి పోతున్నాననిఅన్నారు.  రెండు సార్లు ఓడిపోవడంతో ఆ ఇల్లు అచ్చిరాలేదని  వేరే ఇంటికి మారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేషుగ్గా పనిచేస్తున్నారని,  నియోజకవర్గ అభివృద్ధి కోసమే  టిడిపిలో చేరినట్లు ఆమె చెప్పారు. వైసిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఇదొక దెబ్బే. ఎందుకంటే,  కోర్టుకేసుల కారణంగా ఇక ఎమ్మెల్యేలు వెళ్లరని, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నేత కూడా ఫిరాయింపులుప్రోత్సహించరని అనుకుంటున్నపుడు కల్పన ఇల్లు ఖాళీ చేసింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !