బాలల హక్కుల దినం నాడు విద్యార్థులను ఇలా హింసించారు

First Published Oct 12, 2017, 1:12 PM IST
Highlights

అధికారుల మెప్పు పొందేందుకు  విద్యార్థులను ఇలా ఎండలో వంచి కూర్చోబెట్టి  జిల్లా పేరులోని అక్షరాలుగా మార్చేశారు

వికారాబాద్ జిల్లా ఆఫీసు సముదాయానికి శంకుస్థాపన చేసే సందర్భంగా నిన్న  ఉన్నతాధికారుల మన్ననలు పొందడానికి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను  చిత్ర హింస పెట్టారు.స్కూళ్లోని విద్యార్థులందరిని V K B D I S T (వికారాబాద్ జిల్లా) అనే ఇంగ్లీషు అక్షరాల మాదిరిగా వంగి నక్కి కూర్చోమన్నారు. పైఅధికారులు వచ్చి చూసేదాకా ఈ తతంగం నడిచిందని తెలిసింది. ఇది కల్పతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరిగింది.  పిల్లల ను నడుములు నొస్తున్నాయని మొత్తుకున్నా వినకుండా  V K B D I S T అనే ఇంగ్లీషు అక్షరాల మాదిరిగా పిల్లల ను వంగి కూర్చునేలా చేసి స్వామి భక్తిని చాటుకున్నారు. ఎవరిని తలకూడా ఎత్తనీయలేదు. ఈ దుర్మార్గం  అంతర్జాతీయ బాలికల దినం రోజునే జరగడం విచారకరం.

పిల్లల హక్కుల గురించి వారికి తెలియ చెప్పే కార్యక్రమం వెలగబెట్టమంటే,పిల్లల హక్కులను ఈ రోజు మధ్యాహ్న భోజనం సహితం పెట్టకుండా పిల్లల హక్కుల ను మంట బెట్టారని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు వ్యాఖ్యానించారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ దీనికి బాధ్యులైన వారిని ఉద్యోగాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

click me!