ఉద్యోగాలు ఇలా ఊడ్చుకుపోతున్నాయి

First Published Oct 10, 2017, 6:02 PM IST
Highlights
  • నిరుద్యోగం మన దేశంలో నానాటికీ పెరిగిపోతోంది.
  • గత మూడేళ్లలో ఉద్యోగాల శాతం మన దేశంలో మరింత తగ్గిపోయింది.
  • ఇప్పటి వరకు 37.4లక్షల మంది నిరుద్యోగులుగా మారినట్లు సర్వేలో తేలింది

‘నిరుద్యోగం’.. ఒక దేశ ప్రగతిని అవరోధించగల శక్తి దీనికి ఉంది. ఇప్పుడు ఆ నిరుద్యోగం మన దేశంలో నానాటికీ పెరిగిపోతోంది.  ప్రతి సంవత్సరం.. లక్షల మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని.. ఉద్యోగాల వేటలో పడుతున్నారు. కానీ వారిలో ఉద్యోగాలు దక్కుతున్నది మాత్రం కొందరికే. చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దీంతో దేశం పరిస్థితి దారుణంగా తయారౌతోంది.

గత మూడేళ్లలో ఉద్యోగాల శాతం మన దేశంలో మరింత తగ్గిపోయింది. లేబర్ బ్యూరో అనే సంస్థ చేపట్టిన  సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ప్రతి సంవత్సరం 0.4శాతం ఉద్యోగాలు తగ్గిపోతున్నాయట. 2013-14, 2015-16 సంవత్సరాల మధ్య కాలంలో ఇప్పటి వరకు 37.4లక్షల మంది నిరుద్యోగులుగా మారినట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా కన్ స్ట్రక్షన్, మ్యాన్ ఫాక్చరింగ్, ఐటీ రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది.

 

2010, 2012 సంవత్సరాల్లో 18.5లక్షల మందికి ఉద్యోగాలు లభించగా.. రానురాను ఆ ఉద్యోగాలు తగ్గిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. 2012 నుంచి 2014 సంవత్సరంలో కేవలం 6.2లక్షల మంది మాకి ఉద్యోగాలు లభించగా.. 2014 నుంచి 2015 సంవత్సరంలో 5.92లక్షలకు పడిపోయింది. 2014-15 సంవత్సర కాలంలో నెలకు సగటున 30వేల ఉద్యోగాలను మాత్రమే అందించగా . 2015 మార్చి నుంచి డిసెంబర్ నెలల నాటికి ఉద్యోగాల సంఖ్య 8వేలకు చేరింది.

click me!