
కల్వకుంట్ల కవిత ను ఈ రోజు కేవలం నిజాంబాద్ ఎంపి అనడం సాధ్యంకాదు. అమె పేరు లోక్ సభ నియోజకవర్గం ఎల్లలు దాటి రాష్ట్ర నలుమూలలకు పాకింది. దేశ సరిహద్దులు కూడా దాటిపోయింది.
తెలంగాణలో ఎక్కడ చూసినా కనిపించే మహిళా నాయకురాలు ఆమెయే. ఆంధ్రలో ఆమెకు సరిసమానమయిన వాళ్లేవరూ లేరు.బతుకమ్మాడినా,బోనాలెత్తినా కథ మొత్తం కవిత చుట్టూ తిరుగుతుంది. ఈ రెండింటిని తెలంగాణ ఇంటింటి వైభవంగా మార్చిన ఘనత కవితదే.
బతుకమ్మ, బోనాలు పాత పండగలే అయినా, వాటికి కొత్త గ్లామర్ తెచ్చింది కవిత, ఆమె తెలంగాణ జాగృతియే.అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అందరికంటే ముందు అడిగింది కూడా కవితయే.ఈ కాంపెయిన్ ను ఆమె 2012 నుంచే మొదలుపెట్టారు. ఈ డిమాండ్ మీద 48 గంటల దీక్ష కూడా చేశారు.
ఎంపి గా కూడా ఆమె నిత్యం ఏదో ఒక అంశం మీద పార్లమెంటు లోపల బయటా మాట్లాడుతూనే ఉన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రులు మద్దతు కూడగట్టారు.దీనికోసం ఆమె పలురాష్ట్రాలు పర్యటించారు. ప్రధాని నరేంద్రమోదీని పలుమార్లు కలుసుకున్నారు. తెలంగాణ సమస్యలో మీద ఎన్నిసార్లు ఎందరు కేంద్రమంత్రుల దగ్గరకు ఎంపిల ప్రతినిధి బృందాలను తీసుకెళ్లారో లెక్కేలేదు.
రాష్ట్రంలో తన కార్యక్రమాలను వినూత్నంగా చేపట్టం కవిత ప్రత్యేకత. ఈ మధ్య రాఖీ పండగనాడు ఆమె చేపట్టిన రహదారి భద్రత హెల్కెట్ కానుక కార్యక్రమం‘ సిస్టర్స్4 ఛేంజ్’ ప్రజలను బాగా ఆకట్టుకుంది. అది భారీగా హిట్టయి వైరలయింది. అన్నలకు రాఖీ కట్టడమేకాదు, సురక్షిత ప్రయాణం పేరుతో ఒక హెల్కెట్ కానుక ఇవ్వడం కొత్త ఆలోచన.
ఇవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనుకుంటే, ఆమె రాజకీయ కార్యకలాపాలు కూడా తక్కువేం కాదు. కెటిఆర్ కు ఏమాత్రం తీసిపోకుండా నాటి జిహెచ్ ఎంసి ఎన్నికలలో ప్రచారం చేశారు. ఇపుడు సింగరేణి ఎన్నికలలో ఆమె కృషి కళ్ల ముందు కనబడుతూ ఉంది. సింగరేణి విజయం ఆమెను ముఖ్యమంత్రి పదవికి పోటీ పడేందుకు పూర్తి అర్హత నిచ్చింది. ఇకముందు తెలంగా ముఖ్యమంత్రి పదవి రేస్ గురించి రాస్తే కవిత పేరు విస్మరించడానికి వీల్లేదు.
కెసిఆర్ కూతురయినందునే తెలంగాణాలో కవిత ఇలా అన్ని రంగాలలోవిజయం సాధించందనుకోలేం. తెలుగు నాట చాలా మంది ముఖ్యమంత్రుల కూతుర్లు, కొడుకులు రాజకీయాలలో ఉన్నారు. వాళ్లెవరు చూపని చొరవ కవిత చూపారు. కవిత యావజ్జనం కంట పడేందుకు నిత్యం కృషి చేశారు. కలర్ ఫుల్ కార్యక్రమాలు చేపట్టారు. కాంపెయిన్లు చేశారు. రాజకీయ వ్యూహాలు రచించారు. ఏదైనా ఒక సమస్య వచ్చినపుడు వెంటనే స్పందించడం అలవాటుచేసుకున్నారు. అందుకే ఆమె ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి గతంలో తెలుగు రాజకీయ నాయకురాళ్లెవరూ రానంత దగ్గరగా జరిగారు. సింగరేణి ఎన్నికల విజయం తర్వాత ఆమె అభిమానులు కొంతమంది కవిత రాష్ట్ర రాజకీయాలలోకి రావాలని, అక్కడ పెద్ద పాత్ర పోషించాలని కోరారు. దానర్థం ఏమిటి?