గ్రూప్2 రద్దు చేయాలి, ఉస్మానియాలో ర్యాలీ, విద్యార్థుల అరెస్టు

First Published Jun 13, 2017, 1:00 PM IST
Highlights

అక్రమాలు జరిగిన గ్రూప్2 పరీక్షను రద్దు చేసి మరో మూడు నెలల్లో తిరిగి పరీక్ష నిర్వహించాలని
"మహాశిరోముండన(గుండు గీయించు) నిరసన    కార్యక్రమం" చేయడానికి ఓయూ లైబ్రరీ నుండి ర్యాలీ గా బయలుదేరిన విద్యార్థులు.

అక్రమాలు జరిగిన గ్రూప్2 పరీక్షను రద్దు చేసి మరో మూడు నెలల్లో తిరిగి పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు  డిమాండ్ చేస్తున్నారు.

పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోవడం,ప్రశ్నలు తప్పులు తడక కావడం, కీ విడుదల సక్రమంగా లేకపోవడం, కోర్టు కేసులలో ఇరుక్కున్న గ్రూప్ 2 పరీక్షలను రద్దుచేయాల్సిందేనని వారు చెబుతున్నారు. తాజాగా హైకోర్టు గ్రూప్ 2 పాస్ అయిన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా రద్దు చేసింది.ఈ నేపథ్యంలో ఈ ర్యాలీ మొదలయింది.

వీళ్లు చెపట్టినది గుండుగీయించుకుని నిరసన తెలపడం.

ఈ "మహాశిరోముండన(గుండు గీయించు) నిరసన   కార్యక్రమం" చేయడానికి ఓయూ లైబ్రరీ నుండి ర్యాలీ గా వారు బయలుదేరారు.అయితే, విద్యార్థులపే విద్యార్థి నాయకులను ఆర్ట్స్ కళాశాల ముందుపోలీసులు  అరెస్ట్ చేశారు. 

 అరెస్ట్ కు నిరసనగా ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులు బైటాయించారు.

click me!