సబ్ రిజిస్ట్రార్ ఇళ్లపై ఎసిబి దాడి: రు. 50 కోట్ల ఆస్తి

Published : Jun 13, 2017, 12:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
సబ్ రిజిస్ట్రార్ ఇళ్లపై ఎసిబి దాడి: రు. 50 కోట్ల ఆస్తి

సారాంశం

తెలంగాణాను కుదిపేస్తున్న మియాపూర్ భూకుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంటిపై మంగళవారం ఎసిబి దాడులు నిర్వహించింది. శ్రీనివాస్‌రావుకు చెందిన 10 ఆస్తులపై ఎసిబి ఏకకాలంలో దాడులు చేపట్టారు.

తెలంగాణాను కుదిపేస్తున్న మియాపూర్ భూకుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంటిపై మంగళవారం ఎసిబి దాడులు నిర్వహించింది.

శ్రీనివాస్‌రావుకు చెందిన 10 ఆస్తులపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు.

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఎసిబి ఈచర్యకు పూనుకుంది. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే సుమారు 50 కోట్లకు పైగా అక్రమ ఆస్తులున్నట్లు అధికారులు కనుగొన్నట్లు తెలిసింది.

ప్రస్తుతం శ్రీనివాసరావు భూకుంభకోణంలో సస్పెండై జైల్లో ఉన్నా విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !