మోదీపై తుగ్లక్ ‘చో’లోక్తి !

Published : Dec 07, 2016, 10:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
మోదీపై తుగ్లక్ ‘చో’లోక్తి !

సారాంశం

మోదీని అవినీతి హంతక వ్యాపారిగా అభివర్ణించిన చో రామస్వామి చో మృతి నేపథ్యంలో నెట్ లో వైరల్ గా మారిన ఆయన ప్రసంగం

 

చో రామస్వామి అంటే బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు.. కానీ, తుగ్లక్ ఎడిటర్ అంటే వెంటనే తెలిసిపోతుంది. సమకాలిన రాజకీయాలపై వ్యంగంగా వార్తలు రాసే వ్యక్తిగా చో కు, ఆయన పత్రిక తుగ్లక్ కు మంచి పేరుంది.

 

ఆయన రాతలే కాదు.. మాటలు కూడా చాలా వ్యంగంగా , సూటిగా ఉంటాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన సమక్షంలో హంతకుడిగా పిలవడటమే కాదు.. అలా పిలిచి మెప్పిచారు కూడా.

 

కావాలంటే ఈ వీడియో చూడండి... మోదీని హంతకుడిగా అభివర్ణిస్తూనే ఆయనను ఎలా కీర్తించారో...

 

 

గతంలో మోదీ తమిళనాడులో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సభలో చో రామస్వామి మాట్లాడుతూ.. మోదీని ప్రసంగించాల్సిందిగా తనదైన శైలిలో ఆయనను ఆహ్వానించారు.

 

అవినీతి హంతక వ్యాపారి మోదీ.. సభలో మాట్లాడటానికి రావాలి అని చో ప్రసంగించడంతో  మోదీతో సహా ఆ సభలో ఉన్నవారందరూ పగలబడి నవ్వారు.

 

గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నప్పుడు సోనియా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీని మృతి వ్యాపారిగా అభివర్ణించడం వివాదాస్పదమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చో రామస్వామి ఇలా మోదీని తన దైన శైలిలో కీర్తించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !