సిఎం మీదకు ట్విట్టర్ విసిరిన కిరణ్ బేడి

Published : Jan 07, 2017, 12:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
సిఎం మీదకు ట్విట్టర్ విసిరిన  కిరణ్ బేడి

సారాంశం

సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి జారీ చేసిన ఉత్తర్వును కొట్టేయడమే కాకుండా  ఉత్తర్వులను ఏకంగా ట్విట్టర్ లో పెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ

 

మాజీ పోలీసు అధికారి అయిన కిరణ్ బేడి ఎక్కడున్న సందడే.

 

పుదుచ్ఛేరిలో  లెఫ్టినెంట్ గవర్నర్  కిరణ్ బేడికి, ముఖ్యమంత్రి వి నారాయణస్వామి (కాంగ్రెస్)కు మధ్య ముసుగులో నడస్తున్న కాట్లాట బజారున బడి ఇపుడు సోషల్ మిడియాకెక్కింది.

 

 అధికారిక  ఉత్తరప్రత్యత్తరాల కోసం గాని, సమాచారం ఇచ్చిపుచ్చు కోవడానికి గాని  సోషల్ మిడియా వేదికలయిన ఫేస్ బుక్, వాట్సాప్,ట్విట్టర్ వంటి వాటినిప్రభుత్వాధికారులు వాడు కోరాదని ముఖ్యమంత్రి నారాయణ స్వామి హకుం జారీ చేశారు.

 

ఆయన తరఫున ప్రభుత్వ అండర్ సెక్రటెరీ ఒకరు ఈ మేరకు ఒక సర్క్య లర్ జారీ చేశారు. 

 

అయితే , లెఫ్టినెట్ గవర్నర్  కిరణ్ బేడి ఈ సర్క్యు లర్ చెల్లదని కొట్టి వేశారు.

 

ఒక ముఖ్యమంత్రి  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంత ఈజీ గా గతంలో ఏ గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ తీసి అవతల పడేసి ఉండరేమో.  ఇపుడు నారాయణ స్వామి ఏమి చేస్తార్ చూద్దాం.  ఈ గొడవ వివరాలు:

 

ప్రభుత్వ కార్యకలాపాలకు సోషల్ మీడియాను వినియోగించుకోవడం మీద నిషేధం విధిస్తూ జనవరి 2  తేదీన  సర్క్యు లర్ జారీ అయింది. 

 

‘ చాలా మంది అధికారులు డిజిటల్ మీడియా , ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాఫ్ వంటి సోషల్ మీడియా సాధనాలను అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల కోసం వినియోగించడం ముఖ్యమంత్రి కంటపడింది.  ఈ కంపెనీల సర్వర్లన్నీ విదేశాలలో ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీలు మన అధికారిక సమాచారాన్ని , పత్రాలను సులభంగా  సేకరించగలవు. ఇది ప్రభుత్వ రహస్యల చట్టానికి వ్యతిరేకం. అందువల్ల  ప్రభుత్వాధికారులు,ఉద్యోగులు, వారి అసోషియేషన్లు, ప్రభుత్వం నడిపే ఇతరసంస్థలు సోషల్ మీడియాను అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలకు వినియోగించడం మానుకోవాలి.  ప్రభుత్వాధికారులు సోషల్ మిడియా గ్రూపులు ఏర్పాటుచేయరాదు.  ఏదేని గ్రూప్ లో సభ్యుడిగా కూడా ఉండరాదు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలుతీసుకవడం జరగుతుంది.’ అనేది క్లుప్తంగా  ప్రభుత్వం  అండర్ సెక్రెటరీ కన్నన్ జారీ చేసిన సర్క్కులర్ సారాంశం.

 

ఈ సర్య్యులర్ చెల్లదని కిరణ్   బేడి మరొక సర్క్యులర్ జారీ చేశారు.

 

‘2017 జనవరి రెండో తేదీన సిబ్బంది, పరిపాలనా సంస్కరణల  శాఖ  విడుదల చేసిన సర్క్యులర్ అమలులో ఉన్న మార్గదర్శక సూత్రాలకు, నియమాలకు, విధానాలకు వ్యతిరేకంగా ఉంది. అది ఉత్తది. చెల్లదు.తక్షణం దీనిని అమలు చేయాలి,’ అని లెఫ్టినెంట్ గవర్నర్ సొంతంగా సంతకం చేసి మరీ జారీ చేశారు.

 

 రాజ్యంగ స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా సొంత సంతకంతో నేరుగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది సాధారణంగా ఉండదు. ముఖ్యమంత్రి చర్య చాలా అసాధారణ మైనది కిరణ్ బేడి  భావించినట్లున్నారు.  నేరుగా తానే సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేశారు.

 

అంతేకాదు,  పుండు మీద కారం చల్లుతూ ముఖ్యమంత్రి లేఖను, తన ఉత్తర్వును ఏకంగా ఆమె ట్విట్టర్ పోస్ట్ చేసి తనేమిటో  చూపించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !