ట్రంప్ దెబ్బ... ఐటీ అబ్బ

First Published Jan 6, 2017, 5:13 PM IST
Highlights
  • హెచ్1బి వీసాల బిల్లుపై భారతీయ ఐటీ కంపెనీల గుబులు

 

ఐటీ కంపెనీలకు ట్రంప్ భయం పట్టుకుంది. తాము అధికారంలోకి వస్తే హెచ్-1బీ వీసా అనుమతులను కఠినతరం చేస్తామన్న ట్రంప్ నిర్ణయం సాఫ్ట్ వేర్ కంపెనీల పాలిట ఇప్పుడు శాపంగా మారింది. ఐటీ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పతనమవుతోంది.

 

ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో తదితరాల విలువ రూ.22 వేల కోట్లకు పైగా హరించుకపోయింది.

 

ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ లపైనా పడింది. బీఎస్ఈలో ఐటీ షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి.

 

ఇదే తరుణంలో  హెచ్1బి వీసాల అనుమతులను కఠిన తరం చేసే బిల్లును యూఎస్ కాంగ్రెస్ లో మళ్లీ ప్రవేశపెట్టారు.

 

ఈ బిల్లు పాస్ అవుతే ఐటీ కంపెనీల పతనానికి నాంది పడినట్లే. టాప్ ఐటీ కంపెనీల లాభాలు భారీగా పడిపోతాయి.

 

అందుకే హెచ్-1బీ వీసా బిల్లు అంటే భారతీయ ఐటీ కంపెనీలు హడలిపోతున్నాయి.

 

click me!