సిరిసిల్ల చేనేతలో కెటిఆర్ దంపతుల చిత్రం

Published : Jul 07, 2017, 02:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సిరిసిల్ల చేనేతలో  కెటిఆర్ దంపతుల చిత్రం

సారాంశం

సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ మరొక వింత సృష్టించారు. ఈసారి సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి కె తారక రామారావు దంపతుల ఫొటోను చేనేత వస్త్రంపై అద్భతంగా నేసి తన ప్రతిభను చాటుకున్నారు.

సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ మరొక వింత సృష్టించారు. ఈసారి సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి కె తారక రామారావు దంపతుల ఫొటోను చేనేత వస్త్రంపై అద్భతంగా నేసి తన ప్రతిభను చాటుకున్నారు. కెటిఆర్ దంపతుల ఫొటో ఉన్న ఈ వస్త్రాన్ని త్వరలోనే కెటిఆర్‌కు అందజేస్తానని విజయ్ తెలిపాడు.  చేనేత కళకు ప్రాణం పోసిన కళాకారుడు విజయ్ ఇటువంటి చేనేత వస్త్రాలను నేయడంలో సిద్ధహస్తుడు. ఈ మధ్య నే ఆయన  అగ్గిపెట్టెలో పట్టే చీరను రేసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి బహూకరించిన విషయం తెలిసిందే.

నల్ల వారి కుటుంబం నుంచి స్వామి వారికి ఇలాంటి మొక్కుబడి అందడం ఇది రెండో సారి . గతంలో 1987లో విజయ్ తండ్రి నల్లా పరంధాములు కూడా అగ్గిపెట్టేలో పట్టే ఉల్లి పొరంత పల్చటి పట్టు చీరెను స్వయంగానేసి స్వామి వారికి బహూకరించారు. పరంధాములు మగ్గం ఎన్నో కళాఖండాలను సృష్టించిన  ఈ కళ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చే‘నేత’.

తండ్రి స్ఫూర్తితోనే విజయ్ కూడ ఎన్నో కళాఖండాలను మగ్గం మీద సృష్టిస్తున్నారు. 2012లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను తానూ తయారుచేసి స్వామివారికి కానుకగా ఇస్తానని ఆయన  మొక్కుకున్నారు. ఈ మేరకు ఆయన 60 గ్రాముల బరువు, నాలుగున్నర మీటర్ల పొడవున్న పట్టుచీరె నేశారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !