తలనీలాల వేలంలో 12 కోట్లు ఆర్జించిన టిటిడి

First Published Jul 7, 2017, 12:18 PM IST
Highlights

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల వేలంలో టిటిడి రూ.12.62 కోట్ల ఆదాయం వచ్చింది.ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ -వేలం జరుగుతుంది. నిన్న  టిడి తిరుమల జెఈవోకె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షనలో తలనీలాల ఈ  ఇ-వేలం జరిగింది.

 తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల వేలంలో టిటిడి రూ.12.62 కోట్ల ఆదాయం వచ్చింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ -వేలం జరుగుతుంది.

 నిన్న  టిడి తిరుమల జెఈవోకె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షనలో తలనీలాల ఈ వేలం జరిగింది.

మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకల  రకాలను ఇ-వేలం నిర్వహించారు.

ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 14,900 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలం వేసింది.

కిలో రూ.23,071/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 7800 కిలోలను వేలానికి ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.15 కోట్ల ఆదాయం సమకూరింది.

కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 45,900 కిలోలను వేలానికి ఉంచగా 5,500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.9.47 కోట్ల ఆదాయం సమకూరింది.

కిలో రూ.2,833/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 11,100 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 6,800 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.93 కోట్ల ఆదాయం లభించింది.

కిలో రూ.1,194/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 700 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.33/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 97,000 కిలోలను వేలానికి ఉంచగా 2000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.66 వేల ఆదాయం సమకూరింది.

కిలో రూ.6,052/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 5,800 కిలోలను అమ్మకానికి ఉంచారు. తద్వారా 6.06 లక్షల ఆదాయం వచ్చింది.

click me!