
రాష్ట్ర విభజన తర్వాత నిరుద్యోగులకు ప్రభుత్వంలో ఉపాధి చూపడంలో తెలంగాణ , ఆంధ్రకంటే బాగా వెనకబడి ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యోగ కల్పన కోసం. కాని రాష్ట్రం వచ్చాక నత్తనడక నడిచి నిరుద్యోగులను నిరాశకు గురి చేస్తున్నది ఈ అంశమే. ఆంధ్రలో రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఎంత వేగంగా నడస్తున్నదో చేసేందుకు సబ్ ఇన్స్ పెక్టర్ నియామక ఒక ఉదాహరణ.
రెండు ప్రభుత్వాలు 2016లోనే నోటిఫికేషన్ జారీ చేశాయి. ఆంధ్రలో ప్రాసెస్ ఆరు నెలలలో పూర్తయి ఎంపికయిన అభ్యర్థులు శిక్షణకు సిద్ధమవుతున్నారు.తెలంగాణ లో ప్రాసెస్ ఆగిపోయింది. ఎపుడుపూర్తవుతుందో తెలియదు. ఇది నిరుద్యోగులను, వారి కుటుంబాలను ఎంత క్ష్యోభకు గురి చేస్తుంటుందో వేరే చెప్పనవసరం లేదు.
ఈ రిక్రూట్ మెంట్ కంపారిటివ్ టేబుల్ చూడండి, విషయం మీకే అర్థమవుతుంది.