పార్లమెంటులో రాహుల్ కంటే సోనియాయే రెగ్యులర్

First Published Jun 5, 2017, 7:17 PM IST
Highlights

అనారోగ్యం తో ఉంటేనేం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటుకు రెగ్యులర్. పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడంతో ఆమె రాహుల్ గాంధీ కంటే  చాలామేలు. పిఆర్ ఎస్ లెజిస్లేటివ్ డేట ప్రకారం ఆమె అటెండెన్స్ 59 శాతం.  రాహుల్ అటెండెన్స్ నాలుగు శాతం తక్కువ అంటే 54 శాతమే.

ఈ మధ్య కాలంలో  ఆమె ఆరోగ్యమంతా  బాగుండలేదు. మెడికల్ చెకప్ కు వెళ్లారు. అయినా సరే గత మూడేళ్లలో ఆమె అయిదు సార్లు పార్లమెంటు డిబేట్లలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 11 డిబేట్లలో మాట్లాడారు. 2016  ఆగస్టు 2 వతేదీన వారణాసి రోడ్ షో ఉన్నపుడు ఆమెకు సుస్తీ చేసింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. 2013లో ఆహార భద్రత బిల్లుమీద 9 గంటల చర్చ జరుగుతున్నపుడు ఉన్నట్లుండి ఆమె ఖాయిలా పడ్డారు. అప్పటినుంచి ఆమె తరచూ వైద్యం కోసం ఎక్కడికో వెళుతున్నారు. అమెరికా వెళ్తున్నారని చెబుతారు. అయినా సరే,ఏ మ ాత్రం ఆరోగ్యం అనుకూలించినా ఆమె పార్లమెంటుకు హాజరవుతుంటారు.

పిఆర్ ఎస్ లెజిస్టేటివ్ లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ. ఇది పార్లమెంటు పనితీరు మీద అధ్యయనంచేస్తూఉంటుంది.

click me!