ఇస్రో మార్క్‌ 3డీ1 ప్రయోగం సక్సెస్

Published : Jun 05, 2017, 06:50 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఇస్రో మార్క్‌ 3డీ1 ప్రయోగం సక్సెస్

సారాంశం

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ1ను శ్రీహరి కోటలోని షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.28 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ పర్యవేక్షించారు. ఈ ప్రయోగం కోసం దాదాపు 25.30 గంటలు కౌంట్‌డౌన్‌ సాగింది.

 

 

 

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ1ను శ్రీహరి కోటలోని షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.28 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ పర్యవేక్షించారు. ఈ ప్రయోగం కోసం దాదాపు 25.30 గంటలు కౌంట్‌డౌన్‌ సాగింది. ఇస్రో ఇప్పటి వరకూ ప్రయోగించిన రాకెట్లలోకి ఇదే అతిపెద్దది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ దీనిలో వినియోగించారు. దీనిద్వారా 3,136 కిలోల బరువుగల జీశాట్‌-19 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

 

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ1 విశేషాలు..: రాకెట్‌ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్‌200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్‌110 లిక్విడ్‌ కోర్‌ ఇంజిన్‌, మూడో దశలో సీ25 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉన్నాయి. ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్‌-19 ఉపగ్రహం రాకెట్‌ నుంచి విడిపోనుంది. ఇది భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లోకి 4వేల కిలోలను, దిగువ భూ కక్ష్యలోకి 8వేల కిలోలను మోసుకెళుతుంది.

 

జీశాట్‌-19తో 4జీ మరింత మెరుగ్గా..: జీశాట్‌-19 ఉపగ్రహంలో కేఏ బ్యాండు, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. దీని ద్వారా హైస్పీడు ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తాయి. 4జీ టెక్నాలజీ మరింత మెరుగుపడుతుంది. పాత తరానికి చెందిన ఐదారు కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు అందించిన సేవలను ఇదొక్కటే అందిస్తుంది. ఇందులోని అధునాతన పరిజ్ఞానమే అందుకు కారణం. పదేళ్ల పాటు ఇది సేవలు అందిస్తుంది.

 

ఎన్నో ప్రయోజనాలు: ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యంత బరువువైన ఉపగ్రహాలను మన గడ్డ నుంచే కక్ష్యలోకి పంపే సత్తా చేకూరుతుంది. భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ఇప్పటి వరకు ఏరియన్‌ రాకెట్‌పై ఆధారపడుతోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. రూ.400 కోట్ల మేర ఖర్చూ తగ్గుతుంది. 4,500-5,000 కిలోల బరువు గల ఇన్‌శాట్‌-4 తరహా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో ఎదుగుతుంది. మానవసహిత యాత్రలకూ వీలుకలుగుతుంది. గురుడు, శుక్రుడు వంటి గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే వీలుంటుంద
 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu