షారూక్ ... వినోద ప్రపంచపు రారాజు.

Published : Aug 14, 2017, 04:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
షారూక్ ... వినోద ప్రపంచపు రారాజు.

సారాంశం

షారూక్ ని అభిమానులు కింగ్ ఖాన్ గా పిలుచుకుంటారు ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ జ ాబితాలో చోటు

 

బాలీవుడ్ ఖాన్ త్రయంలో.. షారూక్ ఖాన్ ఒకరు. కేవలం భారత్ లోనే కాకుండా వివిధ దేశాల్లోనూ  అభిమాన సంఘాలు గల నటుడు షారూక్.  అద్భుతమైన నటనతో  అభిమానులను ఆకట్టుకుంటున్న షారూక్ ని .. అందరూ ముద్దుగా ‘కింగ్ ఖాన్’ అని పిలుచుకుంటారు. అయితే.. కేవలం సినిమాల్లోనే కాదు.. షారూక్ చాలా వాటిల్లో ‘కింగ్’ అని నిరూపించుకున్నారు.

సినిమాల్లోనూ..

షారూక్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో చాలా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మరికొన్ని రూ.100కోట్ల క్లబ్బుల్లోనూ చేరాయి. కొన్ని బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచినా.. కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన కింగ్ ఖాన్ అయ్యారు.

ఫోర్బ్స్ జాబితాలో చోటు..

ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం ప్రపంచంలో కెల్లా అత్యధికంగా ఆర్జించే వారి జాబితాను విడుదల చేస్తుంది. ఆ జాబితాలో షారూక్ ప్రతి సంవత్సరం చోటు దక్కించుకోవడం విశేషం. ఒక సంవత్సరంలో అత్యధికంగా ఆర్జించే( సంపాదించే) మొదటి 100 జాబితా విడుదల చేస్తే.. షారూక్ అటూ ఇటుగా 65వ స్థానంలో నిలుస్తారు. అదే భారత్ లో అయితే.. మొదటి స్థానం కోసమే పోటీ పడతారు. ఆయన ఈ ఏడాది ఇప్పటి వరకు 38మిలియన్ డాలర్లు సంపాదించారు. ఆయన ఏడాది సంపాదన రూ.244కోట్లకు పైమాటే.

సోషల్ మీడియాలోనూ..

నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే.. షారూక్.. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, సినిమా వివరాలు, తన పిల్లల గురించి.. ఇలా సందర్భం ఏదైనా ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆయన ట్విట్టర్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 26.2 మిలియన్లకు పై మాటే. అంతే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా 3.5బిలయన్ల మంది అభిమానులు ఆయన సొంతం.  ప్రపంచంలో కెల్లా అత్యంత ధన వంతులైన సినీ నటల్లో షారూక్ కూడా ఒకరు. ఆయనకు 650 నుంచి 750 మిలియన్ డాలర్ల  ఆస్తి ఉందని అంచనా. ఇంత ఆస్తి సంపాదించాలని హాలీవుడ్ నటులు కూడా కలలు కంటూ ఉంటారు. అంత  సంపాదన షారూక్ సొంతం.

విదేశాల్లోనూ అభిమాన సంఘాలు..

షారూక్ కి భారత్ లోనే కాదు.. ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్( యూకే), మలేషియా, ఫిలప్పీన్స్, దక్షిణ కొరియా,  ఆఫ్రికన్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలన్నింటిలోనూ ఆయన అభిమానులు ఉన్నారు. వారంతా ఆయన కోసం ప్రత్యేకంగా అభిమాన సంఘాలు కూడా ఏర్పాటు చేశారు. భారతీయ చిత్రాల స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకువెళ్లిన ఘనత షారూక్ దే. అందుకే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ఇది.. అది అని కాకుండా.. అన్నింటా తనదైన ముద్ర వేయగలడు కాబట్టే.. షారూక్ .. ‘కింగ్ ఆఫ్ ది వరల్డ్’

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu