కేంద్ర హోంశాఖలో భారీగా ఉద్యోగాలు

First Published Aug 14, 2017, 2:42 PM IST
Highlights

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) లో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

గూఢచారి ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) లో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

వివరాలు:

పోస్టు పేరు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్-2)
మొత్తం పోస్టులు: 1300 (జనరల్-951, OBC-184, SC-109, ST-56)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
వయస్సు: 2017 సెప్టెంబర్ 2 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. SC, ST అభ్యర్థులకు ఐదేండ్లు, OBC అభ్యర్థులకు మూడేండ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,600. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (జనరల్, OBC అభ్యర్థులు),SC, ST, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-రాతపరీక్ష టైర్-1(ఆబ్జెక్టివ్ ), టైర్-2 (డిస్క్రిప్టివ్) విధానంలో ఉంది.
-కేవలం రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు అనుమతిస్తారు.

దరఖాస్తు: ఆగస్టు -12-17 నుంచి ఆన్‌లైన్ ద్వారా. మరే ఇతర విధానంలోనైనా పంపిన దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తును పంపేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ- మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 2
 

ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది భారత దేశంలోని అంతర్గత నిఘా సంస్థ. ఇది ప్రపంచంలో అత్యంత పురాతన గూఢచార సంస్థగా ప్రసిద్ధిగాంచినది.

 

 

click me!