నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డికి కోపమొచ్చింది

First Published Aug 14, 2017, 3:56 PM IST
Highlights
  • నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కన్నెర్ర
  • ఎస్ పి కార్యాలయం ఎదుట దీక్ష కు నిర్ణయం
  • ఎస్ పి వివరణతో   దీక్ష ప్రతిపాదన విరమణ

నెల్లూరుజిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బుకీల సెకండ్ ఇన్నింగ్స్  విచారణ మరింత ఉత్కంఠను రేపుతోంది.. విచారణలో మరికొందరి కొత్తపేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వైసిపి ఎమ్మెల్యే పేరు తోపాటు మరొ 37 మంది కీలక పాత్ర ఉందని విచారణలో వెల్లడైనట్లుసమాచారం బయటకు పొక్కింది.బెంగుళూరు నుంచి కృష్ణసింగ్ అనుచరుడి ద్వారా ఆ ఎమ్మెల్యే అకౌంట్లోకి రు. 40 లక్షలు బదిలీ అయినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అది ఎవరో కాదు,రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎక్కెపెట్టిన ప్రచారమే. కావాలనే కొంతమంది తన పేరును ఖరాబు చేసేందుకు అసూయతో చేసిన పని ఇది అని కోటం రెడ్డికి కోపం వచ్చింది.

ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ శ్రీధర్ రెడ్డి ఘూటుగా స్పందించారు. ముసుగులో గుద్దులాట కాకుండా ఆ వైసిపి ఎమ్మెల్యే ఎవరో పేరును బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ ఎమ్మెల్యే పేరు చెప్పి, ఆ నలభై  లక్షల డబ్బు ట్రాన్స్ ఫర్ వ్యవహారమేదో పోలీసలు తేల్చకపోతే, తను ఎస్పి కార్యాలయం ఎదుట గాంధేయ పద్ధతిలో నిరాహార దీక్షకు పూనుకుంటానని కోటంరెడ్డి హచ్చరించారు. కోటం రెడ్డి కోపం వస్తే భీభత్సమే. ఆయన ఎక్కడ బడితే అక్కడ దీక్ష చేస్తాడు.విపరీతంగా ఆయన కోసం జనం వస్తారు. ఎందుకొచ్చిన గొడవ ఇదంతా అని  జిల్లా ఎస్ పి దీని మీద వివరణ ఇచ్చారు.  తామెపుడూ రూరల్ ఎమ్మెల్యే పేరు చెప్పలేదని, ఆ  నలభై లక్షల డబ్బు గురించి మాట్లాడలేదని ఎస్ పి విలేకరులకు చెప్పారు.  దీనితో కోటంరెడ్డి దీక్ష విరమించుకున్నారు.

జిల్లాను కుదిపేస్తున్న క్రికెట్ బెట్టింగ్ సంబంధించి 115 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారని, వారిని కూడా  రెండు మూడు రోజులలో పోలీసులు పట్టుకునే అవకాశం ఉందని తెలిసింది.

click me!