
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు క్రికెట్ లో అదరగొడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై డాషింగ్ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్ లో ప్రశంసలు కురిపించాడు.
ఈ ఏడాదిలో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోహ్లీని అభినందనలతో ముంచెత్తారు....
కోహ్లీ ట్రిపుల్ డబుల్ కొట్టిన నేపథ్యంలో అతడి డబుల్ సెంచరీకి గుర్తుగా కొత్త రూ. 200 నోట్లు ముద్రించాల్సిందిగా కేంద్రానికి వీరూ ట్విటర్ లో ప్రతిపాదన చేశారు.
అంతేకాదు ఆ నోటు ఎలా ఉండాలో ట్విటర్ లో కూడా పెట్టేశాడు. ఆ నోటుపై కోహ్లీ డబుల్ సెంచరీ అనంతరం సంతోషంతో బ్యాటు పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంది.