రూ.2000 నోటు రూ.50 కే

First Published Dec 11, 2016, 1:37 PM IST
Highlights
  • 2 వేల నోటు ఆకృతిలో చైనా పర్సులు

 

మనమంతా నోటు కోసం కోటి కష్టాలు పడుతుంటే ... చైనా మాత్రం ఆ నోటు ఆకృతినే పెట్టుబడిగా పెట్టి కోట్లు కూడగడుతోంది.

 

ఇంతకీ ఈ నోటు కథ ఎంటీ అనుకుంటున్నారా...

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో కరెన్సీ సంక్షోభం తీవ్రమైన విషయం తెలిసిందే. అంతేకాదు కొత్తగా తెచ్చిన రూ. 2 వేల నోటు వల్ల పెద్దగా ఉపయోగం కూడా లేకుండా పోయింది.

 

నవంబర్ 8 తర్వాత దేశంలో ఇన్ని కష్టాలు ఉంటే.. ఈ సంక్షోభాన్ని చైనా మాత్రం భలేగా క్యాష్ చేసుకుంది.

 

అంటే నకిలీ కరెన్సీతోనో.. నగదు మార్పిడికోసమో కాదు.  కొత్త కరెన్సీ నోట్లకోసం ఆశగా ఎదురు చూస్తున్న భారతీయుల మనసు దోచుకునేందుకు చైనా తన మార్కెటింగ్ టెక్నిక్ ను వాడేసింది.

 

దేశంలో చైనా వస్తువులను నిషేధించాలన్న వాదనలు కొనసాగుతుండగానే .. మన కొత్త రూ.500 రూ.2000 నోట్ల డిజైన్ తో పర్సులు  మార్కెట్లలోకి వదిలింది.

 

మన నోట్లు దొరక్క పోయినా ఈ నోట్ల పర్సులు మాత్రం దేశంలో కుప్పలుకుప్పలుగా దొరకుతున్నాయి. వీటి ధర కూడా రూ. 50 లోపే ఉండటంతో మనోళ్లు తెగకొనేస్తున్నారు.

click me!