
టీ మిండియా కెప్టెన్లుగా టైగర్ పటౌడీ, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ లు అందుకోలేని అరుదైన రికార్డును కుర్ర కెప్టెన్ విరాట్ కోహ్లి సాధించాడు.
టెస్టుల్లో కెప్టెన్ గా మూడు సార్లు డబుల్ సెంచరీ చేసి దేశ టెస్టు క్రికెట్ చరిత్ర లో అరుదైన రికార్డును సృష్టించాడు. ఈ ఏడాదిలోనే అతను వెయ్యి పరుగులు చేయడం విశేషం.
ముంబై టెస్ట్ లో చేసిన డబుల్ సెంచరీ తో విరాట్ కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే మూడు డబుల్ సెంచరీలు చేయడం మరో విశేషం.
అంతే కాదు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై తన బెస్ట్ స్కోరును కూడా అందుకున్నాడు. ఇంతకుముందు ఉన్న 211 పరుగుల తన వ్యక్తిగత అత్యధిక స్కోరును ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అధిగమించాడు.
చివరికి 235 పరుగులు చేసి ఔటయ్యాడు. 340 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్ తో విరాట్ 235 రన్స్ చేశాడు.