సౌదీ యువరాజు మృతి

Published : Jul 14, 2017, 05:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
సౌదీ యువరాజు మృతి

సారాంశం

సౌదీ అరేబియా యువ‌రాజు, ఆ దేశ మాజీ ఉప ప్ర‌ధానమంత్రి ప్రిన్స్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ అబ్దులజీజ్ క‌న్నుమూశారు. ప‌విత్ర మ‌క్కాలోని గ్రాండ్ మ‌సీదు వ‌ద్ద ఆయ‌న అంత్య‌క్రియ‌లు  

సౌదీ అరేబియా యువ‌రాజు, ఆ దేశ మాజీ ఉప ప్ర‌ధానమంత్రి ప్రిన్స్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ అబ్దులజీజ్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 86 సంవ‌త్స‌రాలు. ప‌విత్ర మ‌క్కాలోని గ్రాండ్ మ‌సీదు వ‌ద్ద ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని రాయల్ కోర్టు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. అబ్దుల‌జీజ్ మృతి ప‌ట్ల గ‌ల్ఫ్ దేశాలు ప్ర‌గాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్ర‌క‌టించాయి.

బ‌హ్రెయిన్ రాజు హ‌మ‌ద్ బిన్ ఇషా అల్ ఖ‌లీఫా, ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి ఖ‌లిఫా బిన్ సల్మాన్ అల్ ఖ‌లీఫా, యువ‌రాజు స‌ల్మాన్ బిన్ హ‌మ‌ద్ అల్ ఖ‌లీఫా సంతాపాన్ని తెలిపారు. అబ్దుల‌జీజ్ 1931లో రియాద్‌లో జ‌న్మించారు. అమెరికాలో ఆయ‌న ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. యూనివ‌ర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశారు.

కాలిఫోర్నియా మిలట‌రీ అకాడ‌మీలో కూడా ఆయ‌న పూర్వ‌విద్యార్థి. 1970 ద‌శకంలో ఆయ‌న సౌదీ అరేబియా రాజ కుటుంబానికి స‌ల‌హాదారుగా ప‌నిచేశారు. అనంత‌రం 1978లో ఆ దేశ ఉప ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. ఉప ప్ర‌ధానిగా ఉంటూ ర‌క్ష‌ణ‌, విమాన‌యాన శాఖ‌లను ఆయ‌న ప‌ర్య‌వేక్షించారు. 2011 వ‌ర‌కూ సౌదీ అరేబియా ఉప ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !