చంద్రబాబు నాయుడి మంత్రుల పనితీరు ఇలా ఉంది...

Published : Jul 13, 2017, 09:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
చంద్రబాబు నాయుడి మంత్రుల పనితీరు ఇలా ఉంది...

సారాంశం

చంద్రబాబు క్యాబినెట్ మార్పులు చేసి నేటికి వంద రోజులు వందరోజుల్లో మంత్రుల పనితీరు మీద పార్టీలో, ప్రభుత్వంలో రకరకాల చర్చలు పాత మంత్రుల కంటే కొందరు కొత్త మంత్రులు బాగా పనిచేస్తున్నారనే పేరు తొందర్లో పనితీరు మీద ముఖ్యమంత్రి సమీక్ష 

రాష్ట్ర మంత్రివర్గంలో మార్పు, చేర్పులు జరిగి నేటికి సరిగ్గా వంద రోజులుయింది.ఈ సందర్భంగా మంత్రి వర్గ సభ్యలు పనితీరు మీద ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో చర్చ మొదలయింది. కొత్త మంత్రలు ఎలా ఉన్నారు, శాఖ లు మారిన పాత మంత్రులు ప్రతిభ  ఎలా ఉంది అనే దాని మీద అసక్తికరమయిన కథనాలు వెలగపూడిలో ప్రచారంలో ఉన్నాయి.కొందరు మంత్రులు బేష్ గా, మరొకందురు పరవాలేదుగా, ఇంకొందరు ఆశించిన దానికంటే తక్కువగా పనిచేసినట్లు చెబుతున్నారు. తొందర్లో ముఖ్యమంత్రి నాయుడు దీనిని సమీక్షించి అక్షింతలు వేయడమో, ప్రశంసలు కురిపించడమో చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం వర్గాల్లో ప్రభుత్వ వర్గాలో కొంతమంది మంత్రులు మీద  ఉన్న అభిప్రాయాలను ఏషియానెట్ సేకరించింది. అవి ఇవి:

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

 వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. అన్ని చోట్ల ఆయన కనిపించేలా ప్రవర్తించారు. అందుకే ఆయన  భేష్ అని అంటున్నారు. పార్టీ ప్రతినిధిగా జగన్‌పై  సమయస్ఫూర్తితో  ఎదురుదాడి చేయడం, మంత్రిగా వ్యవసాయంపై నిరంతర సమీక్షలు, నకిలీ పురుగుమందులు, విత్తనాల కంపెనీల సీజ్‌తోపాటు, నష్టపోయిన రైతులకు కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పించడంలో ఆయన బాగా పనిచేశారు. మిర్చికి మద్దతుధర క్వింటాలుకు 1500 రూపాయలు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. కడప జిల్లా ఇంచార్జి మంత్రిగా కూడా ఆయన  జిల్లాలో కదలిక తీసుకువచ్చారనే పేరుంది.

నారా లోకేశ్

ఉద్యోగాల గురించి యువకులను బాగా  కన్విన్స్ చేశారు. వచ్చే రెండేళ్ల రెండు లక్షల ఉద్యోగాలనే ప్రకటన బాగా  పేరు తెచ్చింది. 14 ఐటి పరిశ్రమలను తీసుకువచ్చి ప్రారంభించడంలో మంత్రి లోకేష్ ప్రతిభ కనబరిచారు. హెచ్ సిఎల్ ను తీసుకువచ్చారనే పేరు వచ్చింది.ట్విట్టర్ అకౌంట్ కూడా ఆయనకు పేరు తెచ్చింది. అయితే, లోకేష్ నోరు జారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఇబ్బందులు పడ్డారు.  తన దగ్గిర ఉన్న మూడు శాఖల్లో 130కిపైగా సమీక్షలు నిర్వహించారు. ఈ నూరు రోజులలో ఆయన ఎక్కడా మీడియా సమావేశాలు నిర్వహించలేదు.

కళా వెంకటరావు

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యుత్ శాఖ మంత్రిగా కళా వెంకట్రావు వివాద రహితంగా పనిచేశారు. ద్విపాత్రభియనం  విజయవంతంగా చేశారనే పేరు వచ్చింది.ఎమ్మెల్సీ టికెట్లు, నంద్యాల వివాదం, జిల్లా పార్టీ వ్యవహారాలతోపాటు, విద్యుత్ శాఖ సమీక్షల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు.

కాలువ శ్రీనివాసుల

సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు  వైసీపీ మీద, జగన్ మీద ఎదురుదాడిలో  ముందు వరస నాయకుడిగా పేరు తెచ్చకున్నారు.  శాఖాపరమైన వ్యవహారాల్లో కూడా ఆయన పనితీరు ముఖ్యమంత్రి మెప్పుపొందింది.

ఆయ్యన్న పాత్రుడు 

సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ భూకుంభకోణంపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. ఆయన , మరొక మంత్రి గంటాశ్రీనివాస్ మధ్య వివాదం ఒక దశలో పార్టీ నేత బాగా ఇరుకున పెట్టాయి.  ఈ వివాదం వదిలేస్తే శాఖపరంగా ఆయన పనితీరు సంతృప్తికరంగానే ఉందట.

పత్తిపాటి పుల్లారావు

పౌరసరాల శాఖలో  సమర్థంగానే పని చేశారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీలుచేసి మీడియాను తనవైపు తిప్పుకోగిలిగారు. ఇది చాలా హంగామ సృష్టించింది. ఇక శాఖా పర సమీక్షలుగా జోరుగానే చేస్తున్నారు.

పితాని సత్యనారాయణ

 కార్మికమంత్రి పితాని సత్యనారాయణ మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గుంటూరు బజరంగ్ జూట్‌మిల్ కార్మిక సమస్యల ఫైల్‌ను దుమ్ముదులిపి, వారిని చర్చలకు పిలిపించి పనిచేస్తున్నట్లు నిరూపించుకున్నారు. రాజమండ్రి పేపర్ మిల్లు సమస్య కూడా ఒక కొలిక్కితెచ్చారు. విజయనగరం జూట్‌మిల్లు సమస్య పరిష్కారం కోసం చర్చలు ప్రారంభించారు. అన్ని పార్టీలకు చెందిన ట్రేడ్‌యూనియన్లతో సమావేశమయ్యారు. ఎపుడూ బిజీగా ఉండే మంత్రిగా పేరొచ్చింది.

శిద్దా రాఘవరావు

అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఎర్రచందనం, అటవీప్రాంతాల్లో మొక్కల పెంపకం, డ్రోన్లతో నిఘా, అటవీ సిబ్బందికి ఆయుధాలను ఇవ్వాలన్న ప్రతిపాదనలను అమలు చేసేందుకుబాగా కృషి చేస్తున్నారనే పేరుంది. ఈ ప్రతిపాదనలు పాతమే అయినా, ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ  వైసీపీ పైనా ఎదురుదాడిలో ముందు వరసలో ఉంటున్నారు. ఈ మార్కులు కూడా ఆయన బాగా పడుతున్నాయి.

పరిటాల సునీత

కొత్తగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు వచ్చినా  పరిటాల సునీత కూడా నాయకత్వాన్ని మెప్పిస్తున్నారనే పేరు ఉంది. అమె చరుకుగా పనిచేస్తారని మొదటి పేరుంది. అది కొనసాగుతూ ఉంది.

అచ్చన్నాయుడు 

అచ్చెన్నాయుడు రాజకీయంగా జగన్‌పై ఎదురుదాడి చేయటంలో ముందున్నప్పటికీ, రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిఆయనకు చెడ్డ పేరు తెచ్చింది. ఈ మధ్య ఆర్టీవోల ఎసిబి దాడులు చూస్తు ఆ శాఖ అవినీతి ఎంతుందో అర్థమవుతుంది. విజయవాడ ఎంపి-అధికారుల మధ్య జరుగుతున్న వివాదం  పరిష్కరించలేకపోయారనే చెడ్డ పేరొచ్చింది.

అఖిల ప్రియ

ఇక కొత్తగా మంత్రి అయిన భూమా అఖిలప్రియ ఇంకా పట్టు సంపాదించలేకపోయింది.  నియోజకవర్గ స్థాయి నుంచి శాఖాపరమైన వ్యవహారాల్లోనూ పనితీరు అంతంతమాత్రమే అని పేరొచ్చింది. సమీక్షా  సమావేశాలు నిర్వహించినప్పటికీ,నంద్యాల  రాజకీయాలు బాగాత డామినేట్ చేశాయి.దీనితో వివాదాస్పద నేతగా  ముద్రపడింది.

సుజయ కృష్ణ రంగారావు

గనులు, భూగర్భ శాఖ పదవి చేపట్టి నూరు రోజులయినా తన ఉనికిని ఆయన చాటుకో లేక పోయారు. ఎక్కడ ఆయన పేరు వినిపించలేదు. ఉండీలేనట్లు వ్యవహరించారు.దీనికి తోడు  ఆయనకు ఇంకా ఛేంబరు కూడా కేటాయించలేదు.

కె ఎస్ జవహర్

మొత్తానికి వార్తల్లో ఉంటున్నారు. ఆయన వ్యాఖ్యలువివాదాలు సృష్టిస్తున్నాయి. ఎక్సైజ్ మంత్రిగా  జవహర్ బీరుపై చేసిన వ్యాఖ్యలు, వైన్‌షాపులు-బార్ల తరలింపుపై తీసుకున్న నిర్ణయం మహిళల  ఆగ్రహానికి కారణమయ్యాయి.

నక్కా ఆనంద్‌బాబు 

సంక్షేమ శాఖ మంత్రిగా  ఈయన కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోయారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాలు, చావులు చెడ్డపేరు తెచ్చాయి. వర్షాకాలంలో రాకముందే  సమస్యలు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనే ఆలోచన లేకపోవడం... వైఫల్యం అంటున్నారు.

కొల్లు రవీంద్ర

న్యాయ శాఖతో  ఆరుశాఖలు తీసుకున్న కొల్లు రవీంద్ర ఏ శాఖలోనూ ప్రతిభ కనబరచలేకపోయారని అంటున్నారు.

ఆదినారాయణ రెడ్డి

టూరిజం,తెలుగు భాష మంత్రిగా ఆదినారాయణరెడ్డి పని తీరు ఇంకా వెలుగులోకి రాలేదు. ఆయన వార్తల్లో ఉన్నదంతా రామసుబ్బారెడ్డి గొడవ వల్లే. జిల్లాలో పార్టీలో ఆయన ప్రభావం పెద్ద గా లేదని చెబుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !