
అమ్మ మృతి తర్వాత తమిళ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నా డీఎంకే పార్టీ అధినేతగా ఎన్నికైనా శశికళ ఇప్పుడు ప్రభుత్వం పై కూడా పూర్తిగా పట్టు సాధించారు. ఈ రోజు సీఎం పదవికి పన్నీరు సెల్వం రాజీనామా చేశారు.
ఈ నెల 6 వ తేదీన లేదా 9న ఆయన స్థానంలో చిన్నమ్మ తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ రోజు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో పార్టీ నేతల కీలక భేటీ జరిగింది. శశికళతో భేటీ అనంతరం పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేశారు.
అయితే శశికళ మంత్రి వర్గంలో పన్నీరు సెల్వం ఏదో ఒక శాఖ కు మంత్రిగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.