సన్నీలియోన్ ను ఫాలో అయితేనే ఫస్టు మార్కులిస్తాడట

Published : Feb 04, 2017, 09:00 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సన్నీలియోన్ ను ఫాలో అయితేనే ఫస్టు మార్కులిస్తాడట

సారాంశం

విద్యార్థినికి కె.వి. ప్రిన్సిపాల్ ఉద్భోద  

 

‘ఈ జనరేషన్ లో అమ్మాయిలో ఎలా ఉండాలో తెలుసా... నవ్వు ముందు ఓ బాయ్ ఫ్రెండ్ని ఉంచుకో వీలుంటే పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ను ఫాలో అవ్వు.... అప్పడప్పుడు నన్ను కలుస్తూ ఉండు... అప్పుడే నీకు క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తా.. నాలాంటి వాళ్లు సలహాలు ఇస్తుంటే కచ్చితంగా పాటించాలి.. ఇక వెళ్లు...’

ఇదండీ ఓ ప్రన్సిపాల్ తన విద్యార్థినికి చేసిన ఉద్భోద.

 

కర్ణాటకలోని బెంగళూరులోని సదాశివనగర్‌లో ఓ కేంద్రీయ విద్యాలయం ఉంది.  కుమార్ ఠాకూర్ అనే పెద్దాయన దానికి ప్రన్సిపాల్. ఆయన అందరిలాంటి ప్రిన్సిపాల్ కాదు. మరీ హైటెక్కు కల్చర్ ఆయనది. తన విద్యార్థులు కూడా అలానే ఉండాలనుకుంటాడు.

 

ఇటీవల కేవీ లో ప్లస్ 2 చదువుతున్న ఓ విద్యార్థినిని తన చాంబర్ కు పిలిపించుకొని  ఇలా మాట్లాడారు. చివరకు ఈ విషయం విద్యాలయంలోని ఇతర టీచర్లకు తెలియడంతో వారు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ప్రిన్సిపాల్ బండారం బయటపెట్టారు.

 

పోస్కో చట్టం కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన లాంగ్ లీవ్ పై వెళ్లిపోయారు.

 

అయితే కేవీ యాజమాన్యం మాత్రం అతడిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

 

గతంలో కూడా ఈ ప్రిన్సిపాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu