
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైదానంలోనే కాదు బయట కూడా అంతే హుందాగా వ్యవహరిస్తారు. అందుకే తన సుదీర్ఘ క్రికెట్ కేరీర్ లో ఎలాంటి మచ్చలేకుండా దిగ్గజ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు.
ఏప్రిల్ 5న హైదరాబాద్ లో ఐపీఎల్ ప్రారంభోత్సవం కార్యక్రానికి హాజరైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తాను బస చేసిన హోటల్ నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్దకు వచ్చే క్రమంలో ఓ చోట ట్రాఫిక్ సిగ్నల్ పడింది.
కారులో ఉన్న సచిన్ డోర్ విండో తెరిచి తప పక్కనే బైక్ పై ఉన్న యువకుడిని పలకరించాడు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడపొద్దని యువకుడి వద్ద ప్రామిస్ తీసుకున్నాడు. అంతే కాదు ఆ యువకుడి పక్కన ఉన్న మరో వ్యక్తి కి కూడా హెల్మట్ పెట్టుకోవాలని సూచించాడు.
అంతేకాదు వాళ్లు తనతో సెల్ఫీ తీసుకోడానికి వీలుగా విండో తెరిచి వారికి సహకరించారు. కారులో సచిన్ పక్కన ఉన్న వ్యక్తి ఈ వీడియోను తీశారు. ఆ వీడియోని సచిన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.