ఈ 500 నోటు ఎంతో ప్రత్యేకం

Published : Jan 12, 2017, 01:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఈ 500 నోటు ఎంతో ప్రత్యేకం

సారాంశం

ఆర్ బి ఐ ప్రింట్ మిస్స్టేక్ కు ఈ నోటు ఓ ఉదాహరణ

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్ని చిత్రవిత్రాలు జరిగాయో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ మద్య మధ్యప్రదేశ్ లో గాంధీ బొమ్మలేని రూ. 2000 నోట్లు దర్శనమిచ్చాయి.

 

ఆ విషయం మరిచిపోకముందే మధ్యప్రదేశ్లోనే మరో విచిత్రం చోటుచేసుకుంది.  ఒక వైపే ప్రింట్ అయిన రూ. 500 నోటు వెలుగుచూసింది.

 

ఖర్గోన్ జిల్లాలోని ఒక ఏటీఎంలో ఈ ఘటన వెలుగు చూసింది.  హేమంత్ సోని అనే యువకుడు డబ్బులు డ్రా చేయడానికి ఖర్గోన్ లోని ఓ ఏటీఎంకు వెళ్లాడు. రూ. 500 నోటును డ్రా చేశాడు.


అప్పుడు అత్యంత అరుదైన ఈ  500 రూపాయిల నోటు ఆయన చెంతకు చేరింది.

 

విషయం తెలుసుకున్న హేమంత్  దీన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు వేరే నోటును ఇచ్చేశారు. ఈ ఘటనను ఆర్ బీ ఐ దృష్టికి తీసుకెళ్తామని బ్యాంకు అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !