తోక ముడిచిన అమెజాన్

First Published Jan 12, 2017, 7:21 AM IST
Highlights

ఇండియాను గిల్లి తోక ముడిచిన అమెజాన్

 

 గ్లోబల్ ఇ-రిటైట్ దిగ్గజం అమెజాన్ (కెనడా) కొరివితో తలగోక్కుని తోక ముడిచింది. తాను అమ్మకానికి పెంచిన భారత దేశ జాతీయపతాకం డోర్ మాట్లను ఉపసంహరించుకుంది.

 

డోర్ మ్యాట్లను అమ్మకానికి పెట్టన సమాచారం అందగానే భారత్ తీవ్రంగా స్పందించం అమెజాన్ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

 

విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మాస్వరాజ్  హెచ్చరిక జారీ చేస్తూ  జాతీయ పతాకాన్ని అవమాన పర్చినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని అడిగారు. అంతేకాదు, దారికిరాక పోతే, అమెజాన్ కంపెనీ ప్రతినిధులెవరకి వీసా ఇచ్చేది లేదని, ఇచ్చిన వీసాలను రద్దు చేయడం జరుగుతుందని కూడా ఆమె వార్నింగ్ ఇచ్చారు.

 

ఈ వార్నింగ్ ని అమె నిన్న రాత్రే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక్కడ తెల్లవారే సరికి అమెజాన్ దారికొచ్చింది.

 

‘ అట్టవా (కెనడా)లోనిభారత హైకమిషన్ భారత్ అభ్యంతరాన్ని అమెజాన్ దృష్టికి తీసుకువచ్చింది. వాళ్ల ఈ డోర్ మ్యాట్ల అమ్మకాన్ని నిలిపివేశారు. వాటిని ఉపసంహరించుకున్నారు,’ అని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.

 

అమెజాన్ తెలివిగా ఈ మ్యాట్లను amazon.in లో అమ్మకానికి పెట్టకుండా భారతీయుల కంట కనబడకుండా జాగ్రత్త పడ్డామని భావించారు.

 

అయితే, ఈ జండా మ్యాట్లను ప్రపంచంలో ఎక్కడా విక్రయించరాదని భారత్ షరతు విధించింది.

 

అమెజాన్ ఇలా భారత్ ఇలా భారత్ ను గిల్లుకుని అగ్రహానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది హిందూ దేవతల బొమ్మలు చిత్రించిన డోర్ మ్యాట్లను విక్రయానికి పెట్టి చివాట్లు తినింది. అమెజాన్ కు ఇదేదో రోగంలాగా ఉంది. అంతకుముందు ఇస్లామిక్ రాతలున్న  డోర్ మ్యాట్లను కూడా అమ్మకానికి పెట్టి వాళ్ల నుంచి తిట్టు తినింది.

 

click me!