హైదరాబాద్ లో హై ఫ్యాషన్ బ్రాండ్స్ కి కేరాఫ్  అడ్రస్ ఏదో తెలుసా?

First Published Jan 9, 2018, 12:05 PM IST
Highlights

వ్యాపార సంస్థలు కూడా నగరం వైపే చూస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లతోపాటు, వాచ్ షోరూంలు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ ఇలా వివిధ రకాలు ఇక్కడ కొలువు తీరుతున్నాయి.

వ్యాపార రంగంలో హైదరాబాద్ నగరం రోజురోజుకీ ముందుకు దూసుకుపోతోంది. ఒకప్పుడు.. ముంబయి, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లోనే ఏదైనా ఫ్యాషన్ మొదలైతే.. తర్వాత కొంత కాలానికి ఆ ఫ్యాషన్ ట్రెండ్ హైదరాబాద్ లో కనిపించేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. హైదరాబాద్ నగరం పూర్తిగా మారిపోయింది. ఇతర మెట్రో నగరాలతో పోటీపడుతోంది. ఏ ఫ్యాషన్ బ్రాండ్ అయినా.. విడుదలయ్యింది అంటే చాలు.. నగరంలో మెరుస్తూనే ఉంది. వ్యాపార సంస్థలు కూడా నగరం వైపే చూస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లతోపాటు, వాచ్ షోరూంలు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ ఇలా వివిధ రకాలు ఇక్కడ కొలువు తీరుతున్నాయి.

అయితే.. ఈ హై ఫ్యాషన్ బ్రాండ్లన్నీ నగరంలోని ఒకే ఒక స్ట్రీట్ లో ఉన్నాయి. ఆ స్ట్రీట్ ఏదో మీరు ఊహించగలరా..? అదే నండి జూబ్లిహిల్స్ రోడ్ నెం.36. ఈ రోడ్డులోకి ఒక్కసారి వెళితే.. కళ్లు చెదిరే షాపింగ్ మాల్స్ కనపడతాయి. అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇక్కడే లభిస్తాయి. తాజాగా.. ఈ జూబ్లిహిల్స్ రోడ్ నెం.36 మరో ప్రత్యేక స్థానాన్ని కూడా దక్కించుకుంది.  దేశంలో అత్యంత ఖరీదైన హైస్ట్రీట్ లొకేషన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. 2011లో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నిర్వహించిన గ్లోబల్ రిటైల్ డెస్టినేషన్ స్టడీలో అత్యంత ఖరీదైన రోడ్ల జాబితాలో ఈ రోడ్ నెం36.. 17వ స్థానంలో నిలిచింది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయి గుర్తింపు పొందింది.

హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన కమర్షియ ల్‌ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కానీ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36 మాత్రం కాస్త వైవిధ్యం. ఎందుకంటే.. హైటెక్‌సిటీకి వెళ్లే అతి ముఖ్యమైన రహదారి కావడం, విలాసవంతుల ఇళ్లు ఈ ప్రాంతంలో ఉండటం.. అపార్ట్‌మెంట్‌లు, విల్లాల సంస్కృతికి దూరంగా, వాణిజ్య అవసరాలకు ద గ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం వేగవంతం గా అభివృద్ధి చెందుతుందనే అంచనాలతో గతం లో కొంతమంది భారీ పెట్టుబడులను పెట్టారు. అయితే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో డిమాండ్‌ అధికంగానే ఉండేది. కానీ, తెలంగాణ ఏర్పడిన తరువాత ఓ సంవత్సరం ఈ ప్రాంతంలో డి మాండ్‌ ఒక్కసారిగా పడిపోయింది. కానీ మళ్లీ ఇప్పుడు మెరుగుపడింది.

click me!