9జనవరి 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

Published : Jan 09, 2018, 10:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
9జనవరి 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం :మీ మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూ ల ఫలితం పొందుతారు. పిల్లల గురించి శుభవార్త వింటారు.

వృషభం

 

వృషభం : ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు. భూ, వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడతాయి.

మిథునం

 

మిథునం : అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

కర్కాటకం

 

కర్కాటకం : ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కడుపు లేదా ఛాతి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు. గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్య ఎక్కువ గా బాధిస్తుది. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి.

సింహం

 

సింహం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచి త నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.

కన్య

 

కన్య : ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండటం మం చిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బం ది కల్గించే అవకాశముంది. వివాదాల్లో తలదూర్చకండి, మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యంగా ఉం టుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

తుల

 

తుల : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకం గా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కు టుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

వృశ్చికం

 

వృశ్చికం: ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చు లు కానీ ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకొండి. ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

ధనుస్సు

 

ధనుస్సు: ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహా యం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

మకరం

 

మకరం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది

కుంభం

 

కుంభం : మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

మీనం

 

మీనం : చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu