ఫేస్ బుక్ తో గ్యాస్ బుకింగ్

First Published Jan 9, 2018, 11:19 AM IST
Highlights
  • ఇండియన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.
  • ఫోన్‌తో పని లేకుండా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇప్పటివరకు స్నేహితులతో ఛాటింగ్, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం కోసం మాత్రమే ఫేస్ బుక్ ని ఉపయోగించే వాళ్లు. అయితే..ఇక నుంచి గ్యాస్ బుకింగ్ కూడా ఫేస్ బుక్ నుంచే చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభంగా. కేవలం ఫేస్ బుక్ మాత్రమే కాదు.. ట్విట్టర్ నుంచి కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు.

ఫోన్‌తో పని లేకుండా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌకర్యం కల్పించింది. ఇది వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభిప్రాయపడింది. ఫేస్‌బుక్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకునే వారు మొదటగా ఫేస్‌బుక్‌ను లాగిన్ అవ్వాలి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అఫిషియల్ పేజీ @indianoilcorplimited ద్వారా బుక్ చేసుకోవాలి. ఈ పేజీలోకి వెళ్లిన తర్వాత అక్కడ బుక్ నౌను క్లిక్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవాలని సూచించింది. ట్విట్టర్ ద్వారా చేసుకోవాలనుకునే వారు.. మొదట తమ పేజీని లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత @indanerefill ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ మొదలుపెట్టిన ఈ వినూత్న పద్ధతిని త్వరలోనే హెచ్ పి కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

click me!