ప్లాస్టిక్ రైస్ చూపిస్తే యాభై వేలు బహుమానం, సవాల్

First Published Jun 8, 2017, 6:18 PM IST
Highlights

ప్లాస్టిక్ రైస్ ని నిజంగా  ఎవరయినా గుర్తించిన పక్షంలో క్వింటా ల్  బస్తాకి 50 వేల రూపాయలు ఇస్తామని విజయవాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. ప్లాస్టిక్ రైస్ విక్రయిస్తున్నారని  మీడియా లో విపరీతంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  విజయవాడ రైస్ వర్తకులు ఈ సవాల్ విసిరారు. ప్లాస్టిక్ రైస్  కేవలం అపోహ మ ాత్రమే అని అన్నారు.

ప్లాస్టిక్ రైస్ కనుక నిజంగా గుర్తించిన పక్షంలో క్వింటాలు బస్తాకి 50 వేల రూపాయలు ఇస్తామని  రైస్ మిల్లర్స్  అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు.

ప్లాస్టిక్ రైస్ విక్రయిస్తున్నారని వ్యాపారస్థుల  మీద అధికారులు దాడులు జరుపుతున్ననేపథ్యంలో విజయవాడ రైస్ వర్తకులు ఈ సవాల్ విసిరారు.

 అసోసియేషన్ హాలు నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్లాస్టిక్ రైస్ మిల్లర్ల ద్వారా ప్రజలకు అందుతున్నాయి అనేది అవాస్తవం అన్నారు.

 

‘‘ ప్లాస్టిక్ రైస్ పై వచ్చేవన్ని నిరాధారా ఆరోపణలు. దేశ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు  అనేక చోట్ల తనిఖీలు చేశారు.  కానీ ఇక్కడ కూడా ప్లాస్టిక్ రైస్ గాని, వాటిని విక్రయించిన  దాఖలాలు లేవు.  చైనా, జపాన్ దేశాలలో ముద్ద ముద్ద అయ్యే  స్టిక్కి రైస్ తింటారు.  ఆ ఆహారపు అలవాట్లు చూసి ప్రజలు అపోహ పడుతున్నారు.  అంతే తప్ప ప్లాస్టిక్ రైైస్ అనే వి లేవు.చూపిన వారికి బహుమానం,’’అని వెంకటేశ్వరరావు తెలిపారు. 

 అలాగే బియ్యం పై జిఎస్టీ టాక్స్ విధించడం సరికాదన్నారు. దీని వల్ల ప్రజలలో ఆహార భద్రత కొరవడే అవకాశం ఉందన్నారు.

బియ్యం పై విధించిన 5 శాతం టాక్స్ పై కేంద్రం పునరాలోచించాలని కోరారు.

click me!