వాన పడిందో లేదో వజ్రాల వేట మొదలయింది

First Published Jun 8, 2017, 5:38 PM IST
Highlights

అనంతపురం, కర్నూలు జిల్లాలలో వజ్రాల వేట మొదలయింది. అనంతపురం జిల్లా  వజ్రకరూరు పరిసర ప్రాంతాలలో , కర్నూలు జిల్లా లోని జొన్నగిరి, తుగ్గలి, పగిరాయి, పెరవలి, మద్దికెరి ప్రాంతాలలో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాలను వెదుక్కుంటూ పొలాల మీదపడ్డారు. 

అనంతపురం, కర్నూలు జిల్లాలలో వజ్రాల వేట మొదలయింది. 

అనంతపురం జిల్లా  వజ్రకరూరు పరిసర ప్రాంతంలోలో కర్నూలు జిల్లా లోని జొన్నగిరి, తుగ్గలి, పగిరాయి, పెరవలి, మద్దికెరి ప్రాంతాలలో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాలను వెదుక్కుంటూ పొలాల మీదపడ్డారు. 

గత రెండు రోజులుగా ఈ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.

ప్రతి ఏటా జూన్‌లో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా మండల వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెదికే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా ఐదు నుంచి పది దాకా వజ్రాలు దొరుకుతున్నట్లు సమాచారం.

కొద్దిరోజుల్లోనే వజ్రాల వేటగాళ్ల సంఖ్య వందల్లోకి చేరుకుంటుంది. ఈ రెండు జిల్లాల వాసులే కాకుండా ముంబాయి వంటి సుదూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు ఈ వజ్రాల కోసం దినమంతా అన్వేషిస్తూంటారు.

ఒక వజ్రం దొరికినా జీవితం ధన్యమవుతుందనుకుని,చాలా మంది ఉద్యోగస్తులు సెలవుపెట్టి ఈ ప్రాంత రైతులతో కలసి వజ్రాల ను వెదుకుతుంటారు.

వర్షాలు కురిసినపుడు భూమి పై పొరల మట్టి కొట్టుకు పోయి వజ్రాలు కనిపిస్తుంటాయి.

click me!