
టిఆర్ ఎస్ రాజ్య సభ సభ్యుడు కె కేశవరావు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి కొనుగోలు చేసిన భూమిని రెవిన్యూ అధికారులు వెనక్కు తీసుకున్నారు.
గత వారం రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసిన తెలంగాణా ప్రభుత్వం ఇపుడు ఈ భూములను స్వాధీనం చేసుకుంది.
ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం హఫీజ్‌పూర్‌లోని కేశవరావు కుటుంబానికి చెందిన 50 ఎకరాల భూమిని స్వాధీనం అధికారులు స్వాదీనం చేసుకున్నారు.
ఇందులో సుమారు 36 ఎకరాల అటవీ భూమికాగా మిగిలింది ప్రభుత్వానిదని అధికారులు చెబుతున్నారు. ఈ భూములతోపాటు గోల్డ్‌స్టోన్ ఇతర అనుబంధ సంస్థల పేరుమీద రిజిస్ట్రేషన్ చేసిన 20 ఎకరాల భూమినికూడా స్వాధీనం చేసుకుని రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు.
హఫీజ్‌పూర్‌లో సుమారు 2,244 ఎకరాల భూమి ఉండగా దానిలో 422 ఎకరాలు అటవీ శాఖకు కేటాయించారు. 1965లో మిగిలిన భూమిని కొంతమంది రైతులకు లావునీ పట్టాలుగా పంపిణీ చేసారు. ఈ భూమి తమదని గోల్డ్‌స్టోన్ సంస్థ యజమాని కె.నవజ్యోతి చెప్పింది. అంతేకాదు, ఇందులో నుంచి 50 ఎకరాలను కేశవరావుకుమార్తె గద్వాల విజయలక్ష్మి, కోడలు జ్యోత్స్నలకు రిజిష్ట్రేషన్ చేయించారు. ఈ లావాదేవీలను రద్దు చేసి సదరు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.