రాష్ట్రపతి ఎన్డీయె అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు కమెండోల కాపలా

Published : Jun 23, 2017, 08:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
రాష్ట్రపతి ఎన్డీయె అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు  కమెండోల కాపలా

సారాంశం

మొట్టమొదట సారిగా రాష్ట్రపతి ఎన్నికలలో నామినేషన్ వేస్తున్న వ్యక్తి కి కేంద్రం జడ్ ప్లస్ , ఎన్ ఎస జి సెక్యూరిటీ కల్పించింది.  బీహార్ మాజీ గవర్నర్ , బిజెపి దళితనేత అయిన రామ్ నాథ్ కోవింద్ ఈ  రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు. దీనికోసం ఆయనకు ఈ భద్రత కల్పించారు. ఇలాంటిదెపుడూ గతంలో జరగలేదు.

గురువారం ఈ మేరకు ఉత్తరువులిచ్చారు. వెంటనే నేషనల్ సెక్యూరిటీగార్డ్స్ కమెండేలు, ఇతర సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులు ఆయన తాత్కలిక నివాసంన10, అక్బర్ రోడ్ తనిఖీ చేశారు. ఇది కేంద్ర మంత్రి మహేశ్ శర్మ నివాసం. ఢిల్లీ ఇపుడిది కోవింద్  నివాసం.

జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్నపుడు 10 నుంచి 12 మంది ఎన్ ఎస్ జి కమెండోలు ఎపుడూ వెన్నంటి ఉంటారు. ఆయన రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు తీసుకునేదాకా వీరి కాపలా ఉంటుంది. ఇపుడు  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దేశమంతా తిరగాల్సి ఉంది. అందువల్ల వీరిభద్రత అవసరమని ప్రభుత్వం భావించిందని అధికారులు చెబుతున్నారు.

 ఈ ఎన్నికల లో కోవింద్ మరొక దళిత అభ్యర్థి మీరా కుమార్ తో రాష్ట్ర పదవికి పోటీ పడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !