తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

Published : Aug 02, 2017, 03:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

సారాంశం

రాజేంద్రనగర్ లోని తెలంగాణ స్టేట్ కొండా లక్షణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు.

 

 

రాజేంద్రనగర్ లోని తెలంగాణ స్టేట్ కొండా లక్షణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ పోలీసులుఅరెస్టు చేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ కు ఆయనను తరలించారు. పోలీస్‌స్టేషన్ వద్దకు భారీగా టిడిపి కార్యకర్తలుచేరుకున్నారు. అక్కడ  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడారు. 

రేవంత్ రెడ్డి కామెంట్స్...

శాంతి యుతంగా తమ సమస్యల పరిస్కారంకొరకు దర్నా చేస్తుంటే అర్థరాత్రి పోలీసులతో బలవంతంగా అరెస్టు చేయడం చాలాబాధాకరం.

 రాష్ట్రంలో పోలీసుల పాలన కొనసాగుతుంది.పోలీసులతో విద్యార్థుల ఉద్యమాన్ని అణచలేరు.

 విద్యార్థుల దర్నాకు సంఘీబావం తెలిపేందుకు వస్తే మమ్మల్ని కూడా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ కు తరలించడం చాల అమానుషం.

 ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ సాధనకోసం విద్యార్థుల పూర్తి మద్దతు తీసుకొని ఇప్పుడు వారిపైనే పోలీసులతో దాడిచేహించడం హేయమయన చర్యఅని అన్నారు. 

రాష్ట్రంలో ఉన్న ఎ ఒక్క యూనివర్సిటీలోకి నీకొడుకు KTR భద్రత లేకుండా వెళ్ళి క్షేమంగా తిరిగివస్తే నీకు తెలుస్తుందని ఆయన ముఖ్యమంత్రి నుద్దేశించి అన్నారు.

హార్టికల్చర్ డిపార్ట్ మెంటులో ఉన్న సుమారు 400 పోస్టులను భర్తీ చేయాలని వారు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని హార్టికల్చర్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !