మంత్రి ఇంట్లో సోదాలు..7.5కోట్లు స్వాధీనం

Published : Aug 02, 2017, 02:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
మంత్రి ఇంట్లో సోదాలు..7.5కోట్లు స్వాధీనం

సారాంశం

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ ఇంట్లో సోదాలు రూ.7.5కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీశాఖ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు.  ఈ తనిఖీల్లో రూ.7.5కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అధికారులు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఏకకాలంలో 39 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. దిల్లీలో శివకుమార్‌కు చెందిన ఇంట్లో నుంచి రూ. 5కోట్లు,కర్ణాటకలోని మరో భవనంలో రూ. 2.5కోట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

గుజరాత్‌ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల తమ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే. వీరికి మంత్రి శివకుమార్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలతో కలిసి ఈగల్‌టన్‌ రిసార్ట్‌లో ఉండగా.. ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అనంతరం ఆయనను రిసార్ట్‌ నుంచి తన నివాసానికి తీసుకొచ్చి.. అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదే సమయంలో కర్ణాటక, దిల్లీల్లో శివకుమార్‌కు చెందిన ఆస్తులు, భవనాల్లో సోదాలు నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !