వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

Published : Aug 02, 2017, 02:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

సారాంశం

 పది గ్రాముల బంగారం ధర రూ.29,450 కేజీ వెండి ధర రూ.39,180

బంగారం ధర వరసగా రెండో రోజు స్వల్పంగా తగ్గింది.  రూ.80 తగ్గి  పది గ్రాముల బంగారం ధర రూ.29,450కి చేరింది.  
ఓవర్సీస్ మార్కెట్లో,  స్థానికంగా కొనుగోళ్లు స్వల్పంగా తగ్గడంతో బంగారం ధర తగ్గిందని బులియన్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో  ఔన్సు బంగారం ధర 0.16శాతం తగ్గి 1,266.20 డాలర్లకు చేరింది. ఈరోజు వెండి ధర  కూడా స్వల్పంగా తగ్గింది. రూ.320 తగ్గి కేజీ వెండి ధర రూ.39,180కి చేరింది. దేశ రాజధాని దిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల తులం బంగారం విలువ రూ.29,450.. 99.5శాతం స్వచ్ఛత గల బంగారం విలువ రూ.29,300గా ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu