కొత్త ఐదొందల నోటొచ్చేసిందోచ్...

Published : Jun 13, 2017, 01:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
కొత్త ఐదొందల నోటొచ్చేసిందోచ్...

సారాంశం

 కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ తో  భారతీయ రిజర్వు బ్యాంక్ సరికొత్త ఐదొందల రుపాయనోటు  రూపొందించింది.  మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ లో ఈ కొత్త నోట్లను విడుదల చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కొద్దిసేపటి కిందట ట్వీట్ చేసింది.

 కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ తో రిజర్వు బ్యాంక్ సరికొత్త ఐదొందల రుపాయనోటు విడుల చేస్తున్నది.

 మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ లో ఈ కొత్త నోట్లను విడుదల చేస్తునట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కొద్దిసేపటికందట ట్వీట్ చేసింది.

 కొత్త నోటులో  'ఏ' అనే అక్షరాన్ని జోడించారు.

ఈ నోటు మీద   ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో పాటు, వెనక వైపు 2017 అని ముద్రించారు.

కొత్తనోట్ల జనంలోకి వచ్చినా, ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500  నోట్లకు  చట్టబద్ధత కొనసాగుతుందని కూడా బ్యాంకు స్పష్టం చేసింది.  

జూన్ 13 మంగళవారం  నిర్వహించిన 7 రోజులు, 14 రోజులు మరియు 28 రోజులు  ఆర్బిఐ వేరియబుల్ రేట్లు (రెపో రివర్స్‌,   రెపో)  ఈ ప్రకటన జారీ చేసింది.  దాదాపు పాతనోటును పోలిన 66 ఎంఎంx150 ఎంఎం,   స్టోన్‌ గ్రే కలర్‌,  రెడ్‌ ఫోర్ట్‌   భారతీయ వారసత్వ  ప్రదేశం ఎర్ర కోట - రివర్స్ లో భారతీయ జెండా స్పెసిఫికేషన్స్‌ తో దీన్ని రూపొందించారు.

 

అలాగే మహాత్మా గాంధీ చిత్రపటాన్ని, అశోక్‌ స్థంభం కుడివైపున బ్లీడ్‌ లైన్స్‌ ఇతర  గుర్తులతోపాటు, అంధులు గుర్తించేలా ఇంటగ్లియో ముద్రణ కూడా ఉంటుంది.

 గత ఏడాది నవంబర్‌ లో  కేంద్రం  పాత   రూ.500, రూ.1000 పెద్దనోట్లను  రద్దు చేశాక  రిజర్వు బ్యాంకు ఇపుడు చలామణిలో ఉన్న కొత్త రూ.500 నోట్లు తీసుకువచ్చింది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu