మదర్స్ డే గిఫ్ట్... కన్నతల్లికి గుడి కట్టిన లారెన్స్

Published : May 14, 2017, 09:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మదర్స్ డే గిఫ్ట్... కన్నతల్లికి గుడి కట్టిన లారెన్స్

సారాంశం

సినిమా తారలకు అభిమానులు గుడికట్టి పూజించడం మనకు తెలిసిందే. ఇక్కడో సినిమా తార తన తల్లికే గుడి కట్టి అమ్మ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.    

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర మదర్స్ డే న కన్నతల్లికి గుడి కట్టి అమ్మ ప్రేమను చాటుకున్నాడు.

 

తాను కట్టించిన గుడి ప్రపంచంలోని అమ్మలందరికీ అంకితమిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

 

మూడేళ్ల కిందటే తన తల్లి కన్మణి కోసం లారెన్స్ గుడి నిర్మాణాన్ని ప్రారంభించారు. మదర్స్ డే ను పురస్కరించుకొని తన గురువుగారైన సుబ్బరాయన్ తో ఈ రోజు గుడిని ప్రారంభించారు. ఈ సందర్భంగా లారెన్స్ ... తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

‘చిన్నప్పుడు తాను ట్యూమర్ తో బాధపడుతుంటే అమ్మ నాతో ఉండి కంటికిరెప్పలా కాపాడింది. అమ్మ లేకపోతే నేనెప్పుడో చనిపోయి వుండేవాడిని.

 

కాంచన సినిమా షూటింగ్ టైమ్‌లోనూ మెడ నొప్పితో ఆస్పత్రిపాలైనప్పుడు కూడా అమ్మే దగ్గరుండి అంతా చూసుకుంది. అప్పుడే అమ్మకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నాడు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu