నేను చాలా పరిణతి చెందాను - రవిశాస్త్రి

First Published Jul 20, 2017, 1:13 PM IST
Highlights
  • వ్యంగ్యాస్త్రాలు సంధించిన రవిశాస్త్రి
  • శ్రీలంక టూర్ కి ముందు ప్రెస్ మీట్

 
గత కొంత కాలంగా తాను ఎంతో పరిణతి చెందానని టీమిండియా కొత్త కోచ్‌ రవి శాస్త్రి  వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.  శ్రీలంక పర్యటనకు  సిద్దమైన టీం ఇండియా  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలసి రవిశాస్త్రి మొదటిసారి మీడియాతో మాట్లాడాడు. కోచ్‌గా ఆయన నియమాకం చుట్టూ ఇటీవలే హైడ్రామా నడిచింది. దాన్ని ఉద్దేశించే ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసుంటాడని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
అలాగే శ్రీలంక పర్యటనలో ఎదురయ్యే సవాళ్లను గురించి కూడా రవిశాస్త్రి మాట్లాడారు.  గతంలో జరిగిన లంక టూర్‌లో పరిణతి సాధించానని, గడిచిన రెండు వారాల్లో అంతకుమించి పరిణతి సాధించానని భావిస్తున్నట్లు తెలిపాడు.  పాత  జ్ఞాపకాలను తాను మరిచిపోయానని,కొత్త అనుభూతులకై ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. 
  టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్ గా నిలవడం  అనేది ప్లేయర్ల చలవే అని  శాస్త్రి చెప్పాడు.  రవిశాస్త్రి, కుంబ్లే లాంటి వాళ్లు వచ్చి పోతుంటారు, కాని టీంఇండియా జట్టు  శాశ్వతమైనదని తెలిపారు.  బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ నియామకాన్ని ఆయన  సమర్థించుకున్నారు.

click me!