గుంటూరు అధికారి ఇంటిపై ఎసిబి దాడులు

First Published Jul 20, 2017, 12:37 PM IST
Highlights

గుంటూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ ఎం. బాల కుటుంబరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో  ఏకకాలంలో సోదాలు నిర్వహించారు

 

 

గుంటూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ ఎం. బాల కుటుంబరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో  ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు నిర్వహించారు. బాల కుటుంబరావు బంధువుల ఇళ్ళల్లో కూడా సోదాలు చేశారు. ఎసిబి  సోదా చేసిన వాటిలో   కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం చింతలమడ గ్రామంలోని నివాసం కూడా ఉంది. ఏసీబీ అధికారుల తనిఖీలలోె పలు డాక్యుమెంట్లు వెల్లడయ్యాయి.                  
కుటుంబరావు నివాసంలో రెండు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.16 ఇళ్ల స్థలాలు, 6 ప్లాట్లు, వ్యవసాయ భూమి 1.90 సెంట్లు, అరకిలో బంగారం, రెండు వాహనాలు ఉన్నట్లు గుర్తించారు.  వాటి విలువ రెండు కోట్లయి ఉంటుందని అధికారుల అంచనా.బహింరంగ మార్కెట్ లో 10 కోట్ల పైనే అక్రమాస్తుల విలువ ఉంటుందని వారు అంటున్నారు.

click me!