ముస్లింల నోట.. రామాయణ పాట

First Published Sep 11, 2017, 1:19 PM IST
Highlights
  • రామ్ లీలా సమితి ఆధ్వర్యంలో రామాయణ గాథ
  • ఆలపించనున్న ముస్లిం సోదరులు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై వివాదం గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. ఆ ప్రాంతంలో హిందువులకు, ముస్లింలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాంతంలో  రాముని గొప్ప తనాన్ని తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఆ కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు నిర్వహిస్తే.. అదే జరగబోతోంది. ముస్లింలు హిందూ దేవుడైన రాముడి గొప్పతనాన్ని ఎలా వివరిస్తారు.. అదే కదా మీ అనుమానం... చదవండి మీకే తెలుస్తుంది.

 

వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని రామలీలా సమితి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు అయోధ్య, లక్నోలో రామయాణ కథను వివరించనుంది. ఇందుకోసం రామలీలా సమితికి చెందిన పలువురు ఇండోనేషియా నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ కథను వివరించేది.. ముస్లిం సోదరులు. ఈ కార్యక్రమం ముగిసేంత వరకు ఆ ముస్లిం సోదరులు.. మాంసాహారం కూడా ముట్టమని చెబుతున్నారు.

 

ఇలాంటి కార్యక్రమం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం ఇదే తొలిసారని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి లక్ష్మి నారాయణ చౌదురి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విదేశీయులతో.. అందులోనూ ముస్లిం సోదరులతో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా రామలీలను వివరించడంలో ఆ ముస్లింలకు ఎలాంటి  అభ్యంతరం లేదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 15వ తదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

 

అయోధ్యలో స్వామి వివేకానంద ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇండోనేషియా.. ముస్లింలు ఎక్కువగా ఉండే దేశమైనా.. అక్కడ రామ్ లీలపై ఎలాంటి నిషేధం లేదని మంత్రి వివరించారు.

 

click me!