రాహుల్ గాంధీ మీద దాడి ఎందుకు జరిగిందంటే...

First Published Aug 8, 2017, 1:39 PM IST
Highlights

గుజరాత్ వరద ప్రాంతాల పర్యటనలో ఉన్నపుడు రాజీవ్ గాంధీ మీద ఎందుకు దాడి జరిగిందో  లోక్ సభలో కేంద్రహోంంత్రి రాజ్ నాథ్ సింగ్  వెల్లడించారు

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రొటో కోల్ పాటించి ఉంటే గుజరాత్ లో దాడి జరిగి ఉండేది కాదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ గుజ‌రాత్‌లో వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో పర్యటనలోలో ఉన్నపుడు జరిగిన రాళ్ల దాడి మీద ఈ రోజు లోక్‌స‌భ‌లో   రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. బుల్లెట్ ప్రూఫ్ కారు వాడ‌క‌పోవ‌డం వ‌ల్లే రాహుల్ గాంధీపై దాడి జ‌రిగిందని ఆయన చెప్పారు. ‘రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న గురించి రెండు రోజుల ముందే గుజ‌రాత్ పోలీసుల‌కు షెడ్యూల్ అందింది. కాంగ్రెస్ నేత ఎస్‌పీజీ ర‌క్ష‌ణ‌లో ఉన్నారు. రాష్ట్ర పోలీసులు రాహుల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భారీ బందోబ‌స్తు కూడా చేశారు. ఆయ‌న కోసం బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఏర్పాటు చేశారు.  అయితే రాహుల్ బుల్లెట్ ప్రూఫ్  కారులో కాకుండా మామూలు కారులో ప్రయాణం చేశారు.

ఎస్‌పీజీ డ్రైవ‌రే కారును న‌డిపినా , రాహుల్ అనేక చోట్ల కారు ఆపార‌ని, అది షెడ్యూల్‌లో లేద‌ని కూడా హోమ్ మంత్రి చెప్పారు రాజ్‌నాథ్.

హెలిపాడ్‌కు వెళ్తోన్న స‌మ‌యంలో ఒక గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రాయి విసిరాడ‌ని ఒక‌వేళ రాహుల్ బుల్లెట్ ఫ్రూప్ కారు తీసుకుని వెళ్లి ఉంటే ఈ ఘ‌ట‌న జ‌రిగేదే కాదు అని రాజ్‌నాథ్ అన్నారు. రాహుల్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే లోక్‌స‌భ‌లో లేవ‌నెత్తారు.

 

click me!