నేరెళ్ల హింస మీద మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు

First Published Aug 8, 2017, 12:52 PM IST
Highlights

తెలంగాణ ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన దళితులను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.  

తెలంగాణ లో సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘన మీద, పోలీసు చిత్రహింసల మీద రాష్ట కాంగ్రెస్ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హెచ్.ఎల్ దత్తుకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి కుంతియా, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎంపి లు రేణుక చౌదరి, రాపోలు ఆనంద్ భాస్కర్, ఎం.ఏఖాన్, కౌన్సిల్ ప్రతిపక్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తదితరులు ఛెయిర్మన్ ను కలుసుకున్నారు.

నెరేళ్ళ సంఘటన విషయంలో పోలీసులు మానవ హక్కులు కాలరాస్తున్నారని  ముఖ్యమంత్గ్రీ కేసీఆర్ పైన ఆయన కొడుకు కె.టి.ఆర్ పైన వారు  ఫిర్యాదు చేశారు.

తెలంగాణా ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన దళితులను పోలీసుల హింసిస్తున్నారని, నేరాలు ఒప్పకోవాలని చిత్ర హింసలు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు  మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.  

ఛైర్మెన్ దత్తు స్పందిస్తూ వెంటనే నెరేళ్లకు కమిటీని పంపిస్తానని బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని శ్రవణ్ తెలిపారు.

 

click me!